క్రీడాభూమి

ఉపఖండం వెలుపల అతిపెద్ద విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 25: కరీబియన్ దీవుల్లో ప్రారంభమైన నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో టీమిండియా అద్భుతమైన శుభారంభాన్ని అందుకుంది. నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో సోమవారం తెల్లవారు జామున (్భరత కాలమానం ప్రకారం) ఆతిథ్య వెస్టిండీస్ జట్టును ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో మట్టికరిపించి నాలుగు రోజులకే ఘన విజయాన్ని సాధించింది. భారత ఉప ఖండం వెలుపల టీమిండియా సాధించిన అతిపెద్ద విజయంగా ఇది చరిత్రకెక్కింది. బౌలింగ్‌లో దుమ్మురేపిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగే బంతులతో విజృంభించిన అశ్విన్ 83 పరుగులిచ్చి 7 వికెట్లు కైవసం చేసుకున్నాడు. భారత ఉప ఖండం వెలుపల అశ్విన్ ఒకే టెస్టులో ఐదు కంటే ఎక్కువ వికెట్లు సాధించడం ఇదే తొలిసారి. దీంతో ఒకానొక దశలో 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు సాధించిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత 132 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఓటమి అంచుకు చేరుకుంది. అయితే తొమ్మిదో వికెట్‌కు 95 పరుగులు జోడించి ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు అతిపెద్ద భాగస్వామ్యాన్ని అందించిన కార్లోస్ బ్రాత్‌వైట్ (51-నాటౌట్), దేవేంద్ర బిషూ (45) విండీస్ ఓటమిని కొద్దిసేపు ఆలస్యం చేయగలిగారే తప్ప నివారించలేకపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైన వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అంతకుముందు భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 566 పరుగుల స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ 243 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడిన విషయం తెలిసిందే.

చిత్రం.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రవిచంద్రన్ అశ్విన్ 7/83