క్రీడాభూమి

సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: డోపింగ్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ యాదవ్‌కు అతని సహచర రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ బాసటగా నిలిచాడు. ఈ కుంభకోణంపై విస్తృతమైన దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని యోగేశ్వర్ దత్ మంగళవారం ఉద్ఘాటించాడు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పక్కకు నెట్టి వివాదాస్పద రీతిలో రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు ఆదివారం వెల్లడైన విషయం విదితమే. బ్రెజిల్‌లో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు పట్టుమని పది రోజుల గడువు కూడా లేక మునుపే ఈ విషయం వెలుగులోకి రావడం దేశ క్రీడా రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. అయితే తన వ్యవహారంలో ఏదో కుట్ర జరిగిందని వాపోతున్న నర్సింగ్ యాదవ్ దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్‌తో ఇప్పుడు యోగేశ్వర్ దత్ కూడా గొంతు కలిపాడు. ‘రెజ్లింగ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తీవ్ర విచారాన్ని కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. నర్సింగ్ యాదవ్ తెలివి తక్కువ వాడు కాదు. అతను డోపింగ్‌కు పాల్పడడని నేను కచ్చితంగా చెప్పగలను’ అని యోగేశ్వర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
కాగా, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) కూడా నర్సింగ్ యాదవ్‌కు అండగా నిలబడింది. నర్సింగ్ విషయంలో ఏదో కుట్ర జరిగినట్లు స్పష్టమవుతోందని డబ్ల్యుఎఫ్‌ఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో నర్సింగ్‌కు చేయూతనివ్వాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకు డబ్ల్యుఎఫ్‌ఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు డోపింగ్ కుంభకోణంలో నర్సింగ్ యాదవ్ బుధవారం జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణా కమిటీ ఎదుట విచారణకు హాజరు కానున్నాడు. ఈ వ్యవహారంలో నర్సింగ్ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఇదే చివరి అవకాశం.