క్రీడాభూమి

రెండో టెస్టులోనూ విజయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, జూలై 29: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసిన భారత క్రికెట్ జట్టులో శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. విండీస్ అందుకు భిన్నంగా దారుణంగా విఫలమవుతున్నది. అటు బౌలింగ్‌లోగానీ, ఇటు బ్యాటింగ్‌లోగానీ ఆ జట్టు రాణించలేకపోతున్నది. ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంపై కనే్నసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో విజయాన్ని నమోదు చేయడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంటామన్న ధీమాతో ఉన్నాడు. ఆతర్వాత మూడో మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకొని విండీస్‌కు వైట్‌వాష్ వేయడమే కోహ్లీ లక్ష్యం. దానిని అందుకోవడానికి టీమిండియా సంసిద్ధంగా ఉంది.
ఫామ్‌పై ఆందోళన లేదు; పుజారా
తాను ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన చెందడం లేదని భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా స్పష్టం చేశాడు. శుక్రవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ఆరు ఇన్నింగ్స్‌లో ఒక్క అర్ధ శతకం కూడా లేనంత మాత్రాన తాను పూర్తిగా ఫామ్‌ను కోల్పోయానని అనుకోవడానికి వీల్లేదన్నాడు. మొత్తం మీద తాను బాగానే బ్యాటింగ్ చేస్తున్నానని, ఒకటిరెండు భారీ ఇన్నింగ్స్‌తో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. విండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అనవసరమైన షాట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయానని, అలాంటి పొర పాట్లు మళ్లీ చేయనని పుజారా చెప్పాడు.