క్రీడాభూమి

కదంతొక్కిన కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, జూలై 29: రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న కొద్దీ బ్రెజిల్‌లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఒలింపిక్స్‌ను వేదికగా చేసుకొని తమ సమస్యలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికి, బ్రెజిల్ సర్కారు మెడలు వంచి డిమాండ్లను సాధించుకోవడా నికి వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికుల తోపాటు వైద్యులు, ఉపాధ్యాయులు, కర్షకులు, చివరికి పోలీసులు కూడా నిరసనలకు దిగారు. రియో ప్రధాన క్రీడా వేదికలకు సమీపంలో నిరసనలు చేస్తున్నారు. తాజాగా రియో దక్షిణ ప్రాంతంలోని ఆంగ్రా డస్ రీస్‌లో కదంతొక్కిన కార్మికులపై భద్రతా సిబ్బంది విరుచుకు పడడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఒలింపిక్ వేదికల వద్ద అధికారులు భద్రతను పెంచారు. కాగా, డిమాండ్ల సాధనకు చట్టపరిధిలో నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు, జవాన్లు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. భద్రతా బలగాల దమన కాండ ఎంత తీవ్ర స్థాయలో ఉందో చెప్పడానికి వీలుగా వీడియో క్లిప్పింగ్స్‌ను వారు ఇంటర్నెట్‌లో ఉంచు తున్నారు. బ్రెజిల్ సర్కారు, మంత్రులు, అధికారులు మూకుమ్మడిగా రాజ్యాంగ ఉల్లంఘటనకు పాల్పడుతున్నారని, ప్రజా హక్కులను కాలరాస్తున్నారని వారు ఆరోపించారు. రియోలో మహిళల సంరక్షణ, ప్రజా హక్కుల కోసం పోరాడేందుకు అందరూ ఒకే వేదికను ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఇందులో ఎక్కువగా యువకులే ఉండడం గమనార్హం. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే వివిధ కార్యక్రమాలను వేదికగా చేసుకొని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాలను భద్రతా సిబ్బంది అడ్డుకునే తతంగాన్ని వీడియోలో బంధించారు. దానిని ఇంటర్నెట్‌లో పెట్టి, తమ పోరాటానికి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒలింపిక్స్ ప్రారంభం రోజు నుంచి ఆ మెగా ఈవెంట్ ముగిసే వరకూ ఒలింపిక్స్ క్రీడా ప్రాంగణాల వద్ద నిరసనలకు సిద్ధమవుతున్నారు. బ్రెజిల్ సర్కారు సమస్యలను పరిష్కరించకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తూ, హక్కులపై పోరాడుతున్న తమను హింసిస్తున్నదని ధ్వజమెత్తుతున్నారు. మొత్తం మీద నిరసనల మధ్యే ఒలింపిక్స్ జరగడం ఖాయంగా కనిపిస్తున్నది.