క్రీడాభూమి

రష్యా వివాదంపై ఐఒసి త్రిసభ్య కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, జూలై 31: వందకుపైగా అథ్లెట్లు డోపింగ్ పరీక్షలో పట్టుబడి, సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో రష్యాను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌పై చర్చించి, నివేదికను సమర్పించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ డోపింగ్ సమస్యకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, ప్రతిపాదనలు చేస్తుందని ఐఒసి అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపాడు. ఇక్కడ జరిగిన ఐఒసి పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు. త్రిసభ్య కమిటీలో ఐఒసి మెడికల్ కమిషన్ చైర్మన్ అగర్ ఎర్డెనర్ (టర్కీ), అథ్లెట్స్ కమిషన్ చీఫ్ క్లాడియా బొకెల్ (జర్మనీ), మోడ్రన్ పెంటథ్లాన్ సమాఖ్య ఉపాధ్యక్షుడు జూనియర్ జువాన్ ఆంటానియో సామరాంచ్ (స్పెయిన్) సభ్యులుగా ఉంటారని తెలిపాడు. ఒలింపిక్స్‌కు ఎంపికైన అథ్లెట్లలో ఇప్పటికే 117 మంది డోపింగ్ పరీక్షలో విఫలమై, సస్పెన్షన్ వేటును ఎదుర్కోవడంతో రష్యాను ఈ మెగా ఈవెంట్ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ జోరందుకుంది. రియో ఒలింపిక్స్ పనులను పరిశీలించడంతోపాటు, రష్యా వివాదంపై ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సమావేశమైన ఐఒసి పాలక మండలి పలు అంశాలను చర్చించింది. రియోలో ఒలింపిక్ కేంద్రాలు, క్రీడా గ్రామంలో ఏర్పాట్లు, వౌలిక సదుపాయాలు, జికా వైరస్ ప్రమాదం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రష్యా అథ్లెట్ల పరిస్థితిని పాలక మండలి సభ్యులు ప్రత్యేకంగా సమీక్షించారు.