క్రీడాభూమి

పతకం తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ అభియోగాల నుంచి రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు విముక్తి కల్పించి దేశం తరఫున అతను రియో ఒలింపిక్స్ బరిలోకి దిగేందుకు వీలుకల్పించాలని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని సహచర రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్ స్వాగతించాడు. రియో ఒలింపిక్స్ 74 కిలోల రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు ఎవరు ప్రాతినిథ్యం వహించాలన్న దానిపై నర్సింగ్ యాదవ్‌కు, సుశీల్ కుమార్‌కు మధ్య తీవ్రమైన పోరాటం జరిగిన విషయం తెలిసిందే. ఈ పోరాటంలో నర్సింగ్ యాదవ్ విజయం సాధించి ఒలింపిక్ కోటా బెర్తును కైవసం చేసుకోవడంతో సుశీల్ కుమార్‌కు చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో సుశీల్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ అతనికి నిరాశ తప్పలేదు. అయితే డోపింగ్ వ్యవహారంలో నాడా విచారణ కమిటీ నర్సింగ్ యాదవ్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం పెద్ద శుభవార్త అని సుశీల్ కుమార్ పేర్కొన్నాడు. నర్సింగ్ యాదవ్‌కు గతంలో మద్దతు తెలిపానని, ఇప్పుడూ మద్దతు తెలుపుతున్నానని, ఇకముందు కూడా మద్దతు తెలుపుతానని, రియో ఒలింపిక్స్‌కు వెళ్లి దేశానికి పతకాన్ని తీసుకురావలసిందిగా నర్సింగ్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సుశీల్ కుమార్ చెప్పాడు.

చిత్రం.. సుశీల్ కుమార్