క్రీడాభూమి

ఒలింపిక్ పతకమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ వ్యవహారంలో సోమవారం నాడా విచారణ కమిటీ ఇచ్చిన తీర్పు పట్ల రెజ్లర్ నర్సింగ్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఇక రియో ఒలింపిక్స్‌కు వెళ్లి దేశానికి పతకాన్ని తీసుకురావాలని ఎదురు చూస్తున్నానని అతను స్పష్టం చేశాడు. ‘నేను ఎటువంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకే న్యాయం జరుగుతుందని గట్టిగా విశ్వసించా. ఇప్పుడు నాడా విచారణ కమిటీ ఇచ్చిన తీర్పుతో నాకు న్యాయం జరిగింది. నిజం గెలిచింది. ఇది చాలా పెద్ద విజయం. ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ తీర్పుతో ఇక ముందు ఏ క్రీడాకారుడికీ నా లాంటి పరిస్థితి ఎదురుకాబోదని భావిస్తున్నా. ఇక రియో ఒలింపిక్స్‌కు వెళ్లి దేశానికి పతకాన్ని అందించాలని ఎదురు చూస్తున్నా’ అని నర్సింగ్ యాదవ్ తెలిపాడు.