క్రీడాభూమి

యువీ, భజ్జీలకు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రతిష్టాత్మకమైన సయ్యద్ ముస్తాక్ అలీ నేషనల్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని నాలుగు వేర్వేరు నగరాల్లో జరిగే ఈ టోర్నీ త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ట్వంటీ-20 సిరీస్‌లో పాల్గొనబోతున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కటి అవకాశాన్ని కల్పించనుంది. క్రికెట్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లకు, అలాగే చాలా కాలం తర్వాత జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కించుకుని ఈ ఏడాది మార్చిలో జరిగే ఐసిసి ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువరాజ్, నెహ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ టోర్నీ పరీక్షగా నిలువనుంది. ఇప్పటివరకూ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైన ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుని ఫిబ్రవరిలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలానికి ముందు వివిధ ఫ్రాంచైజ్‌లను మెప్పించేందుకు ముస్తాక్ అలీ ట్వంటీ-20 టోర్నీ అవకాశాన్ని కల్పించనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని ముస్తాక్ అలీ టి-20 టోర్నీని నిర్వహించాలని నిర్ణయించడం సానుకూల చర్య. గతంలో ముస్తాక్ అలీ టి-20 టోర్నమెంట్‌ను ఐపిఎల్ టోర్నీకి ముందు అదరాబాదరాగా నిర్వహించడంతో అది ప్రాధాన్యత కోల్పోయింది. దీంతో అప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం పాటలు ముగిసి ప్రతిభావంతులైన దేశవాళీ ఆటగాళ్లకు ఐపిఎల్ కాంట్రాక్టులు పొందే అవకాశం లభించేదికాదు.
ప్రస్తుతం ముస్తాక్ అలీ ట్వంటీ-20 టోర్నీలో పంజాబ్ జట్టు కెప్టెన్ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ కొచ్చిలో రాజస్థాన్‌తో తలపడనుండగా, నాలుగున్నరేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత జాతీయ జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్న ఆశిష్ నెహ్రా ఢిల్లీ జట్టుతో కలసి రైల్వేస్‌తో తలపడనున్నాడు. భారత ట్వంటీ-20 జట్టుకు ఎంపికైన నెహ్రా ఆస్ట్రేలియా వెళ్లేందుకు విమానం ఎక్కడానికి ముందు ముస్తాక్ అలీ టి-20 టోర్నీలో తన సత్తా చాటుకోవాలని ఎదురుచూస్తున్నాడు. నెహ్రాతో పాటు యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఏ ఐపిఎల్ జట్టులో లేరు. దీంతో ఐపిఎల్ జట్ల యజమానులను మెప్పించేందుకు ముస్తాక్ అలీ టి-20 టోర్నీ వారికి అదనంగా మరో అవకాశాన్ని కల్పించనుంది. యువరాజ్, నెహ్రాలతో పాటు చాలా కాలం తర్వాత భారత వనే్డ జట్టులో స్థానం కోల్పోయిన సురేష్ రైనా కూడా ముస్తాక్ అలీ ట్వంటీ-20 టోర్నీలో సత్తా చాటుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ జట్టు కటక్‌లో మహారాష్ట్ర జట్టుతో తలపడనుంది. కాగా, గతంలో బెంగాల్ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన ఆల్‌రౌండర్ లక్ష్మీరతన్ శుక్లా ఇటీవల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 19 ఏళ్ల తర్వాత శుక్లా లేకుండా బరిలోకి దిగుతున్న బెంగాల్ జట్టు నాగ్‌పూర్‌లో హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఐపిఎల్‌లో వరుసగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్లలో చోటు కోల్పోయిన బెంగాల్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారీ, పేసర్ అశోక్ దిండా కూడా ముస్తాక్ అలీ ట్వంటీ-20 టోర్నీలో సత్తా చాటుకుని ఐపిఎల్ జట్ల యజమానులకు గాలం వేయాలని ఎదురుచూస్తున్నారు.