క్రీడాభూమి

దారులన్నీ మరకానాకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తున్న మరకానా స్టేడియం స్టార్ అట్రాక్షన్‌గా నిలిచింది. దశాబ్దకాలంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నది. ఈవెంట్ నిర్వాహణ ఎలావున్నా, ప్రారంభం అదిరిపోతే, ఆతర్వాత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది నిర్వాహకుల అభిప్రాయం. రియోలోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన మరకానా స్టేడియానికి ఘన చరిత్రే ఉంది. బ్రెజిల్‌లో సాకర్‌కు విపరీతమైన ఆదరణ ఉంటే, 1950 ఫిఫా ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చిన మరకానా స్టేడియం అక్కడి ప్రజలకు పవిత్ర స్థలం. అక్కడే 2013 కాన్ఫడరేషన్ కప్ ఫైనల్, 2014 ప్రపంచ కప్ ఫైనల్ కూడా జరిగాయి. అందుకే ప్రారంభోత్సవానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో స్టేడియం క్రిక్కిరిసిపోయింది.