క్రీడాభూమి

బుకీలతో చేతులు కలిపిన ‘నెట్ బౌలర్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జవరి 1: శ్రీలంక క్రికెటర్లు కుశాల్ జనిత్ పెరీరా, రంగన్ హెరత్‌లను ఒక బుకీ సప్రదించాడంటూ వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో ఒక ప్రాక్టీస్ నెట్‌బౌలర్ అనుమానితుడుగా ఉన్నట్లు శ్రీలంక క్రీడల శాఖ మంత్రి దయాసిరి జయశేకర శుక్రవారం చెప్పాడు. అతనిపై ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం(ఎఫ్‌సిడిఐ) వద్ద తాము ఫిర్యాదు చేయనున్నట్లు జయశేకర విలేఖరులకు చెప్పాడు. ఈ నెట్ బౌలర్ ద్వారా బుకీలు ఆ ఇద్దరు క్రికెటర్లను సంప్రదించినట్లు భావిస్తున్నామని ఆయన తెలిపాడు. గత ఏడాది అక్టోబర్‌లో గాలెలో జరిగిన శ్రీలంక-వెస్టిండీస్ టెస్టుమ్యాచ్ సందర్భంగా సామర్థ్యానికన్నా తక్కువ ప్రతిభ చూపాలని బుకీలు తమను సంప్రదించారంటూ పెరీరా, హెరత్‌లు చేసిన ఫిర్యాదుపై శ్రీలంక ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శ్రీలంక వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. దరిమిలా రాండమ్ టెస్టులో పెరీరా నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్లు తేలింది. రెండోసారి ఇచ్చిన ‘బి’ శాంపిల్ పరీక్షలో అతను ఈ స్టెరాయిడ్‌ను వాడినట్లు తేలింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) రూలింగ్ కోసం అతను ఎదురు చూస్తున్నాడు. కాగా, ఐసిసి ఇచ్చే రూలింగ్‌పై అపీలు చేస్తామని శ్రీలంక తెలిపింది. కాగా, బుకీలు తనను సంప్రదించినట్లు పెరీరా చెబుతున్న నేపథ్యంలో పెరీరా డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడం కూడా ఒక కుట్ర అయి ఉండవచ్చన్న అనుమానాలను జయశేకర వ్యక్తం చేసాడు.