క్రీడాభూమి

మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సైకోమ్ మీరాబాయ్ చాను 48 కిలోల విభాగంలో దారుణంగా విఫలమైంది. ప్రారంభపు వెయిట్‌ను కూడా ఎత్తలేకపోయింది. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో మూడుసార్లు కనీస బరువును కూడా ఎత్తలేకపోయింది. మొదట క్లీన్ అండ్ జెర్క్‌లో 104 కిలోల బరవును ఎత్తడానికి విఫలయత్నం చేసింది. రెండు, మూడు ప్రయత్నాల్లో మరో రెండు కిలోలను పెంచి, 106 కిలోల బరువును ఎత్తేందుకు సిద్ధపడినా, చేతులెత్తేసింది. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన 107 కిలోలు. కానీ, ఒలింపిక్స్‌లో ఆమె అదే స్థాయిలో రాణించలేకపోయింది. మొత్తం 12 మంది పోటీపడగా, మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైంది. మరో లిఫ్టర్ మాత్రమే మీరాబాయ్ మాదిరిగా ఒక్క ప్రయత్నంలోనూ సఫలం కాలేకపోయింది.
థాయిలాండ్‌కు తొలి పతకం
ఒలింపిక్స్‌లో థాయిలాండ్ తొలి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో సోపిటా తనాసన్ థాయిలాండ్‌కు మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని అందించింది. ఈ విభాగంలో ఇండోనేషియాకు చెందిన అగుస్టియానీ శ్రీ వాహ్యునీ రజత పతకాన్ని గెల్చుకోగా, జపాన్ లిఫ్టర్ హిరోమీ మియాకే కాంస్య పతకాన్ని సంపాదించుకుంది.
క్వార్టర్స్‌లో మహిళా ఆర్చర్లు
భారత మహిళా ఆర్చర్లు టీం ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరారు. దీపికా కుమారి, లైష్రామ్ బొంబాల్యాదేవి, లక్ష్మీరాణి మజిహీ సభ్యులుగా ఉన్న భారత జట్టు కొలంబియాతో జరిగిన ఎలిమినేషన్‌ను 5-3 తేడాతో గెల్చుకుంది. క్వార్టర్స్‌లో పటిష్టమైన రష్యాను ఢీకొనేందుకు సిద్ధమైంది.