క్రీడాభూమి

టీటీలో పోరాటానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: టేబుల్ టెన్నిస్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. టైటిల్ సాధించే అవకాశాలు ఉన్నాయనుకున్న ఆచంట శరత్ కమల్ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించడంతో టీటీలో నలుగురితో బరిలోకి దిగిన భారత్ పోరు ముగిసింది. రుమేనియాకు చెందిన వెటరన్ ఆటగాడు క్రిసాన్ ఆడ్రియన్‌తో తలపడిన శరత్ కమల్ 12-14, 11-9, 6-11, 8-11 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. ఈ మ్యాచ్ కేవలం 35 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. మరో సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సౌమ్యజిత్ ఘోష్ కూడా విఫలమయ్యాడు. పడసాక్ టన్విరియవెచాకుల్‌ను ఢీకొన్న అతను 8-11, 6-11, 14-12, 6-11, 11-13 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. అంతకు ముందు మహిళల తొలి సింగిల్స్‌లో డానియేలా డొడియన్‌ను ఢీకొన్న 34 ఏళ్ల వౌమా దాస్ 2-11, 7-11, 7-11, 3-11 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మరో సింగిల్స్‌లో తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన మనీకా బత్రా 12-10, 6-11, 12-14, 11-8, 4-11, 12-14 తేడాతో కటజునా ఫ్రాన్క్ గ్రీబొవ్‌స్కీ చేతిలో ఓడింది. వౌమాతో పోలిస్తే మనీకా చివరి వరకూ గట్టిపోటీనివ్వడం గమార్హం. మొత్తం మీద టీటీలో భారత్‌కు ప్రాతినిథ్యం ఇచ్చిన నలుగురి పోరాటం మొదటి రౌండ్‌కే పరిమితమైంది. ఈ నాలుగు మ్యాచ్‌ల నిడివి కేవలం రెండు గంటల 19 నిమిషాలు మాత్రమే.

టెన్నిస్‌లోనూ డౌటే!
మిక్స్‌డ్ డబుల్స్‌పైనే ఆశ

రియో డి జెనీరో: టేబుల్ టెన్నిస్‌లో భారత్ పోరాటానికి తెరపడగా, టెన్నిస్‌లోనూ అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. మహిళల డబుల్స్‌లో దేశానికి టైటిల్ అందిస్తుందనుకున్న సానియా మీర్జా మొదటి రౌండ్‌లో ఓటమిపాలుకాగా, పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్, రోహన్ బొపన్న జోడీ మొదటి పరీక్షలోనే విఫలమైన విషయం తెలిసిందే. దీనితో మిక్స్‌డ్ డబుల్స్‌పైనే అభిమానులు ఆశ పెట్టుకున్నారు. ఈ విభాగంలో పోటీలు పదో తేదీ నుంచి మొదలవుతాయి. మహిళల డబుల్స్‌లో ప్రార్థన తొంబారేతో కలిసి బరిలోకి దిగిన సానియా రెండు గంటల 44 నిమిషాల పాటు హోరాహోరీ పోరాటం కొనసాగించినా ఫలితం లేకపోయింది. చైనాకు చెందిన షుయ్ జాంగ్, షయ్ పెంగ్ జోడీ 7-6, 5-7, 7-5 ఆధిక్యంతో సానియా, ప్రార్థన జోడీని ఓడించి ముందంజ వేసింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా మాట్లాడుతూ రియోలో పతకం కోసం తన వేట కొనసాగుతుందని స్పష్టం చేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బొపన్నతో కలిసి పోరాడానని, పతకం సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది. తాను ఏ టోర్నీకి వెళ్లినా టైటిల్ సాధించాలనే అభిమానులు కోరుకుంటారని, కానీ, ప్రతిసారీ అది సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. సర్వశక్తులు ఒడ్డుతామే తప్ప ఫలితాలను నిర్దేశించే అవకాశం తమకు లేదని చెప్పింది. ప్రార్థనను తప్పుపట్టడానికి వీల్లేదని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో ఉన్నప్పటికీ ఆమె అద్భుతంగానే పోరాడిందని కితాబునిచ్చింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్ కోసం తన ప్రయత్నం కొనసాగుతుందని తెలిపింది. ఇలావుంటే, టెన్నిస్‌లో పురుషులు, మహిళల సింగిల్స్‌తోపాటు భారత్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగింది. అయితే, మొదటి రెండు ఈవెంట్స్‌లో ఓటమిపాలైన భారత్‌కు ఇప్పుడు సానియా, బొపన్న జోడీగా పోటీపడే మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లే చేతిలో ఉన్నాయి. ఈ విభాగంలోనూ ఓడితే, టెన్నిస్‌లో భారత్ పోరుకు తెరపడుతుంది.