క్రీడాభూమి

హీనా సిద్ధు నిష్క్రమణ నిరాశపరుస్తున్న షూటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌లో షూటర్లు నిరాశ పరుస్తున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పతకం సాధించే సత్తా ఉన్న జీతూ రాయ్ క్వాలిఫయింగ్ రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేసినా, ఫైనల్స్‌లో విఫలమయ్యాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టైటిల్ రేసులో ముందుంటుందని అనుకున్న హీనా సిద్ధు ఎవరూ ఊహించని విధంగా క్వాలిఫయింగ్ రౌండ్స్ నుంచే నిష్క్రమించింది. అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అపూర్వీ చండీలా, అయోనికా పాల్ క్వాలిఫయింగ్ రౌండ్స్‌లోనే విఫలమయ్యారు. వీరిద్దరికీ క్వాలిఫయింగ్స్‌లో వరుసగా 34, 47వ స్థానాలను లభించాయి. వారి దారిలోనే హీనా కూడా నడిచింది. మొత్తం 380 పాయింట్లు సంపాదించిన ఆమెకు 14వ స్థానంతో సంతృప్తి చెందింది. క్వాలిఫయింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారికే ఫైనల్స్‌లో అవకాశం దక్కుతుంది. అంతకంటే ఆరు స్థానాలు వెనుకలో ఉన్న హీరా పోటీ నుంచి నిష్క్రమించింది.
కాగా, క్వాలిఫయింగ్ రౌండ్‌లో 580 పాయింట్లు సంపాదించి, ఆరో స్థానంలో నిలవడం ద్వారా ఫైనల్స్‌కు దూసుకెళ్లిన జితూ పతకం వేటలో విఫలమయ్యాడు. ఫైనల్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అతను 576 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. ఆరంభలో తడబడిన అతను ఆతర్వాత కోలుకోలేకపోయాడు. ఇలావుంటే, ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత షూటర్ గుర్‌ప్రీత్ సింగ్ కనీసం ఫైనల్స్ కూడా చేరలేకపోయాడు. ఈ పోటీల్లో వియత్నాం షూటర్ హొయాంగ్ జువాన్ విన్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఆతిథ్య దేశం బ్రెజిల్‌కు యూ ఫెలిప్ అల్మేదా రజత పతకాన్ని అందించాడు. చైనాకు చెందిన పాంగ్ వెయ్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
పురుషుల షూటింగ్ ట్రాప్ ఈవెంట్‌లో పోటీపడిన మానవ్‌జిత్ సింగ్ సంధు, కైనాన్ చెనాయ్ క్వాలిఫయంగ్ రౌండ్స్‌లోనే విఫలమయ్యారు. మానవ్ జిత్ 68 పాయంట్లు సంపాదించి 17వ స్థానంలో నిలవగా, 67 పాయంట్లు సాధించిన చైనాన్‌కు 19వ స్థానం దక్కింది. ఈ క్వాలిఫయంగ్ పోటీల్లో ఇటలీకి చెందిన మాసిమో ఫాబ్రిజీ మొత్తం 75 పాయంట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఎడ్వర్డ్ లింగ్ (గ్రేట్ బ్రిటన్), గియావొనీ పెలిలో (ఇటలీ) చెరి 73 పాయంట్లతో సమవుజ్జీగా నిలిచారు. అయతే, ప్రోగ్రెసివ్ పాయంట్ల ఆధారంగా ఎడ్వర్డ్‌కు ద్వితీయ, పెలిలోకు తృతీయ స్థానాలు లభించాయ.