క్రీడాభూమి

పురుషుల హాకీలో ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: పురుషుల హాకీలో భారత జట్టు ఓటమిపాలైంది. నెదర్లాండ్స్‌ను ఢీకొన్న భారత్ సరైన దిశగా పోరాడడంలో విఫలమై, 1-2 తేడాతో పరాజయాన్ని కొనితెచ్చుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే భారత రక్షణ విభాగంపై విరుచుకుపడిన నెదర్లాండ్స్ ముమ్మర దాడులకు దిగింది. మ్యాచ్ 32వ నిమిషంలో రోజర్ హాఫ్‌మన్ ద్వారా నెదర్లాండ్స్‌కు తొలి గోల్ లభించింది. అయితే, ప్రత్యర్థికి ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయకుండా, ఆరు నిమిషాల తేడాలోనే రూపీందర్ పాల్ సింగ్ భారత్‌కు ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత ఇరు జట్లు గోల్స్ కోసం ముమ్మర పోరాటాన్ని కొనసాగించాయి. భారత్ తనకు లభించిన అవకాశాలను చేజార్చుకోగా, చివరి క్షణాల్లో మిక్ వాన్ డెర్ వీర్డెన్ చేసిన గోల్‌తో నెదర్లాండ్స్ 2-1 తేడాతో విజయభేరి మోగించింది. భారత్ క్వార్టర్స్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.