క్రీడాభూమి

గుర్‌ప్రీత్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: పురుషుల షూటింగ్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలో గుర్‌ప్రీత్ సింగ్ ఫైనల్ చేరే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 581 పాయింట్లు సంపాదించిన అతను ఏడో స్థానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్స్‌లో మొదటి ఆరు స్థానాలు పొందిన వారు ఫైనల్‌కు అర్హత సంపాదిస్తారు. గుర్‌ప్రీత్ ఏడో స్థానంలో నిలవడంతో ఫైనల్ చేరలేక నిష్క్రమించాల్సి వచ్చింది. క్రిస్టియన్ రెజ్ (592), జాంగ్ ఫషెంగ్ (590) జియాన్ క్వికాంపో (586) వరుసగా మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు.
దత్తు ఓటమి
పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్ విభాగంలో భారత రోయర్ దత్తు బొకానల్ 13వ స్థానంతో తృప్తి చెందాడు. మహె డ్రైస్‌డేల్ (న్యూజిలాండ్) 6 నిమిషాల 41.34 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన డామిర్ మార్టిన్ కూడా అంతే సమయంలో రేస్‌ను పూర్తి చేసినప్పటికీ ప్రోగ్రెసివ్ ఫలితాల ఆధారంగా అతనికి రజత పతకాన్ని అందచేశారు. ఆండ్రెజ్ సినెక్ (చెక్ రిపబ్లిక్) 6 నిమిషాల 44.10 సెకన్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. దత్తు రేస్‌ను 6 నిమిషాల 54.96 సెకన్లలో గమ్యాన్ని చేరాడు.