క్రీడాభూమి

మహిళల 10,000 మీటర్ల పరుగు అయానా రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 13: ఇథియోపియా అథ్లెట్ అల్మాజ్ అయానా మహిళల 10,000 మీటర్ల పరుగులో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న ఆమె 29:31.45 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరింది. 1993 సెప్టెంబర్ 8న బీజింగ్ జరిగిన ఈవెంట్‌లో 29:31.78 నిమిషాలతో చైనా రన్నర్ వాంగ్ జున్ జియా నెలకొల్పిన ప్రపంచ రికార్డును అయానా బద్దలు చేసింది. కెన్యా అథ్లెట్ వివియన్ చెరుయట్ 29:32.53 నిమిషాలతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అత్యంత వేగంగా ఈ రేస్‌ను పూర్తి చేసిన అథ్లెట్ల జాబితాలో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఆరంభంలో కొంత వెనుకబడినప్పటికీ, సగం రేసు ముగిసిన తర్వాత వేగంగా ముందుకు దూసుకొచ్చిన అయానా మిగతా ప్రత్యర్థులను వెనక్కు నెడుతూ, రికార్డు టైమింగ్‌తో గమ్యాన్ని చేరింది. 23 సంవత్సరాల క్రితం నెలకొన్న ప్రపంచ రికార్డును అధిగమించింది. తిరుష్ డిబాబా 29:42.56 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి కాంస్య పతకాన్ని అందుకుంది.