క్రీడాభూమి

మహిళల స్టీపుల్ చేజ్ ఫైనల్స్‌కు లలిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 13: భారత అథ్లెట్లు మూకుమ్మడిగా విఫలమవుతున్న తరుణంలో మహిళల స్టీపుల్ చేజ్‌లో లలితా బాబర్ అభిమానుల ఆశను నిలబెట్టింది. 9 నిమిషాల 19.76 సెకన్లలో ఈవెంట్స్‌ను పూర్తి చేసిన ఆమె ఏడో స్థానంలో నిలవడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. రూత్ జబాట్ (బహ్రైన్/ 9:19.76), బిట్రిస్ చెకోచ్ (కెన్యా/ 9.17.55), ఎమ్మా కొబర్న్ (అమెరికా/ 9:18.12 నిమిషాలు) వరుసగా మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. భారత్‌కే చెందిన సుధా సింగ్ 9 నిమిషాల 43.29 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి, ఫైనల్‌కు అర్హత సంపాదించలేక నిష్క్రమించింది.