క్రీడాభూమి

టీమిండియాకే సిరీస్ మూడో టెస్టులో ఓడిన విండీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాస్ ఐలెట్, ఆగస్టు 14: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ని 237 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న భారత క్రికెట్ జట్టు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. దీనితో చివరిదైన నాలుగో టెస్టు నామమాత్రంగా మారింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 129.4 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ 118, వృద్ధిమాన్ సాహా 104 పరుగులతో రాణించారు. అల్జరీ జోసెఫ్ 69 పరుగులకు మూడు, మిగుల్ కమిన్స్ 54 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ 103.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. కార్లొస్ బ్రాత్‌వెయిట్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా మార్లొన్ శామ్యూల్స్ 48 పరుగులు చేశాడు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ 33 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, విండీస్‌ను దెబ్బతీశాడు. 218 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 48 ఓవర్లలో ఏడు వికెట్లకు 217 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. ఆజింక్య రహానే అజేయంగా 78 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 41 పరుగులు సాధించాడు. కమిన్స్ 48 పరుగులకు 6 వికెట్లు కూల్చాడు. కాగా, విజయానికి రెండో ఇన్నింగ్స్‌లో 346 పరుగులు సాధించాల్సి ఉండగా వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. డారెన్ బ్రేవో 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితోపాటు శామ్యూల్స్ (12), రోస్టన్ చేజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో విండీస్‌కు భారీ పరాజయం తప్పలేదు.