క్రీడాభూమి

ముర్రే ‘ది గ్రేట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: బ్రిటిష్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఒలింపిక్స్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను 7-5, 4-6, 6-2, 7-5 తేడాతో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణాన్ని సాధించిన అతను వరుసగా రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన తొలి టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. అతని ఖాతలో రెండు ఒలింపిక్స్ స్వర్ణాలతోపాటు 2012 యుఎస్ ఓపెన్, 2013, 2016 వింబుల్డన్ టైటిళ్లు ఉన్నాయి. 29 ఏళ్ల ముర్రే తన కెరీర్‌లో తొలిసారి వరుసగా 18 మ్యాచ్‌ల్లో విజయాలను సాధించాడు.
98 ఏళ్ల తర్వాత..
జపాన్‌కు ఒలింపిక్స్‌లో 98 సంవత్సరాల తర్వాత ఒక పతకం దక్కింది. పురుషుల సింగిల్స్‌లో మూడో స్థానానికి జరిగిన పోరులో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌ను 6-2, 6-7, 6-3 తేడాతో ఓడించిన నిషికొరి ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. 1920 ఆంట్‌వెర్ప్ ఒలింపిక్స్‌లో జపాన్‌కు పురుషుల సింగిల్స్‌లో ఇచియా కమాగే, డబుల్స్ విభాగంలో ఇచియా కమాగే, సీచిరో కషివో జోడీ ద్వారా రజత పతకాలు లభించాయి. సుమారు శతాబ్దం కాలంగా టెన్నిస్‌లో పతకం కోసం ఎదురుచూస్తున్న జపాన్ కలను నిషికొరి సాకారం చేశాడు.

చిత్రం.. రియో ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్‌లో పతకాలు సాధించిన
జువాన్ మార్టిన్ డెల్ పొట్రో (రజతం), ఆండీ ముర్రే (స్వర్ణం), కెయ్ నిషికొరి (కాంస్యం)