క్రీడాభూమి

సర్వత్రా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించబోయే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సైతం ఈ నివేదికలో పొందుపరచే అంశాలు ఎలావుంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుపై విచారణ పూర్తి చేసిన సుప్రీం కోర్టు దోషులను నిర్ధారించింది. వారికి విధించాల్సిన శిక్షను ఖరారు చేసే బాధ్యతను విశ్రాంతి న్యాయమూర్తులు అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ కూడా సభ్యులుగా ఉన్న లోధా కమిటీకి అప్పగించింది. అంతేగాక, బిసిసిఐని అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాల్సిందిగా కోరింది. సుప్రీం ఆదేశాల మేరకు, స్పాట్ ఫిక్సింగ్ కేసుపై పలువురి నుంచి సమాచారం సేకరించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను లోధా కమిటీ రెండు సంవత్సరాలపాటు ఐపిఎల్ నుంచి సస్పెండ్ చేసింది. అంతేగాక, చెన్నై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. బిసిసిఐ పాలనావ్యవస్థ పారదర్శకంగా ఉండడానికి, అవినీతికి తావులేకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ నివేదికలోని అంశాలపై లోధాగానీ, ఇతర సభ్యులుగానీ ఇప్పటి వరకూ ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనితో సూచన ప్రాయంగా కూడా సమాచారం తెలియడం లేదు. అయితే, కమిటీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వర్గాలు చెప్తున్న వివరాల ప్రకారం బిసిసిఐ పాలక మండలిలో రాజకీయ నాయకుల పాత్ర లేకుండా చూడాలని లోధా కమిటీ సూచించవచ్చు. బిసిసిఐ కేంద్ర ఎగ్జిక్యూటివ్ నుంచి వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల వరకూ ఎక్కడా ప్రస్తుత లేదా మాజీ క్రికెటర్లు కీలక పాత్ర పోషిస్తున్న దాఖలాలు లేవు. బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) ఉపాధ్యక్షుడిగా దిలీప్ వెంగ్‌సర్కార్‌ను మినహాయిస్తే, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వారెవరూ క్రికెట్ సంఘాల్లో కీలకంగా లేరు. పై నుంచి కింది స్థాయి వరకూ క్రికెట్‌ను రాజకీయ నాయకులే శాసిస్తున్నారన్నది వాస్తవం. అందుకే, నాయకులు లేని క్రికెట్ బోర్డును లోధా కమిటీ సూచించే అవకాశాలున్నాయి. అదే విధంగా ఐపిఎల్ కోసం ఒక ప్రైవేటు కంపెనీని ఏర్పాటు చేయాలని సూచించవచ్చు. అదే విధంగా పరస్పర ప్రయోజనాల అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు. ఇలావుంటే, రాజకీయ నాయకులు ఉండకూదన్న ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకించడం ఖాయం. క్రీడాకారులంతా సమర్థులైన పాలకులని చెప్పడానికి వీల్లేదని నేతల అభిప్రాయం. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ఉపాధ్యక్షుడిగా ఉండి, అవినీతి ఆరోపణలపై ఎనిమిదేళ్ల సస్పెన్షన్‌కు గురైన ఫ్రాన్స్ మాజీ సాకర్ వీరుడు మైఖేల్ ప్లాటినీ ఉదంతాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. పాలనా వ్యవహారాలను క్రీడలతో ముడిపెట్టడం సమంజసం కాదని వాదిస్తున్నారు. బిసిసిఐని ఆర్థికంగా బలోపేతం చేసిన ఎన్‌కెపి సాల్వే, జగ్మోహన్ దాల్మియా వ్యాపారవేత్తలుకాగా, ఐఎస్ బింద్రా బ్యూరోక్రాట్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. క్రికెటర్లు కానివారు బిసిసిఐ పాలక మండలిలో ఉండరాదని కమిటీ సిఫార్సు చేస్తే, బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నుంచి ఐపిఎల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాజీవ్ శుక్లా వరకూ ఎంతో మంది తమతమ ప దవులకు దూరంకాక తప్పదు. ఈ అనుమానమే మనోహర్ సహా భారత క్రికెట్‌లో కీలకంగా ఉన్న చాలా మందిని వే ధిస్తున్నది. మొత్తం మీద లోధా కమిటీ సిఫార్సుల్లో ఏఏ అంశాలు ఉండబోతున్నాయోనన్న ఊహతో, ఇప్పటి నుంచి వాదోపవాదాలు మొదలయ్యాయి. సోమవారం ఈ సిఫార్సులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.