క్రీడాభూమి

కోలుకోని మెక్‌కలమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ వౌగనుయ్ (న్యూజిలాండ్), జనవరి 4: శ్రీలంకతో మంగళవారం జరిగే చివరిదైన ఐదో వనే్డలో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండ్ మెక్‌కలమ్ ఆడడం లేదు. గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోలేదని, అందుకే ఈ మ్యాచ్ నుంచి కూడా అతనికి విశ్రాంతినిచ్చామని కోచ్ మైక్ హెసన్ ప్రకటించాడు. లంకతో జరిగిన రెండో వనే్డలో ఆడుతూ, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మెక్‌కలమ్ కాలికి గాయమైంది. ఆతర్వాత అతను వరుసగా రెండు వనే్డల్లో ఆడలేకపోయాడు. చివరి మ్యాచ్‌కీ అందుబాటులో ఉండడని హెసన్ స్పష్టం చేశాడు. మూడు వరుస మ్యాచ్‌ల్లో పాల్గొనని అతను లంకతో జరిగే టి-20 సిరీస్‌కు, ఆతర్వాత పాకిస్తాన్‌తో జరిగే టి-20 సిరీస్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. వచ్చేనెల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన అతను ఆతర్వాత జరిగే టి-20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం లేదు. అందుకే, శ్రీలంక, పాకిస్తాన్ జట్లతో టి-20 సిరీస్‌లకు అతను దూరంగా ఉంటాడు. అయితే, పాకిస్తాన్‌తో జరిగే వనే్డ సిరీస్‌లో మెక్‌కలమ్ ఆడతాడని హెసన్ తెలిపాడు. అప్పటిలోగా అతను పూర్తిగా కోలుకుంటాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

సెరెనాకు ఫిట్నెస్ సమస్య!
పెర్త్, జనవరి 4: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నది. మోకాలి నొప్పి వేధిస్తున్న కారణంగా ఆమె హాప్‌మన్ కప్ తొలి మ్యాచ్ నుంచి వైదొలగింది. ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా స్విటొలినాతో ఆమె సోమవారం ఉదయం మహిళల సింగిల్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, ఆట ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు తాను బరిలోకి దిగడం లేదని సెరెనా ప్రకటించింది. కెరీర్‌లో 21 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సంపాదించిన 34 ఏళ్ల సెరెనా ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకూ జరిగే యుఎస్ ఓపెన్‌కు సిద్ధమవుతున్నది. ఆ మెగా గ్రాండ్ శ్లామ్‌కు సన్నాహక టోర్నీగా మిక్స్‌డ్ టీం ఈవెంట్‌గా జరిగే హాప్‌మన్ కప్‌లో పాల్గొంటున్నది. అయితే, మోకాలి వాచి, నొప్పి చేయడంతో తాను మొదటి మ్యాచ్‌లో ఆడడం లేదని ఆమె తెలిపింది. అయితే, దీనిని చిన్న సమస్యగా అభివర్ణించింది. హాప్‌మన్ కప్ తొలి మ్యాచ్ నుంచి వైదొలగాల్సి రావడం తనను నిరాశ పరచిందని తెలిపింది. తర్వాతి మ్యాచ్‌లో ఆడతానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.