క్రీడాభూమి

మా సింధు వచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 23: రియో ఒలింపిక్స్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన తెలుగుతేజం పివి సింధు తొలిసారి విజయవాడలో అడుగుపెట్టడంతో సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో సింధు, ఆమె కుటుంబ సభ్యులతోపాటు కోచ్ గోపీచంద్‌ను తీసుకువచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో భారీ ర్యాలీ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియానికి చేరుకుంది. ప్రత్యేక వాహనంపైనుండి సింధు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ స్వాగత ర్యాలీలో మధ్య మధ్యన గ్రామస్థులు ఆపుతూ పట్టువస్త్రాలతో ఆమెను సత్కరించారు.
సింధుతోపాటు కోచ్ గోపీచంద్ కూడా రోడ్డుకిరువైపులా ఉన్న క్రీడాకారులు, విద్యార్థులకు అభివాదం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. నిడమానూరు గ్రామ ప్రజలు, పలు పాఠశాలల విద్యార్థులు భారీ త్రివర్ణపతాకంతో సింధుకు స్వాగతం పలికారు. డప్పు కళాకారులతో పాటు సాంప్రదాయ సంగీత వాయిద్యకారులు ప్రత్యేకంగా అలరించారు. ర్యాలీ స్టేడియానికి చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదురొచ్చి సింధు, గోపీచంద్‌లకు స్వాగతం పలికారు. ఆతర్వాత సింధు సన్మాన సభ జరిగింది.

చిత్రం... విజయవాడలో మంగళవారం బాడ్మింటన్ స్టార్ పివి సింధుకు ఘనస్వాగతం పలుకుతున్న విద్యార్థులు