క్రీడాభూమి

గుప్టిల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మొన్గానీ (న్యూజిలాండ్), జనవరి 5: శ్రీలంకతో మంగళవారం జరిగిన చివరి, ఐదో వనే్డను గెల్చుకున్న న్యూజిలాండ్ ఈ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ సూపర్ సెంచరీ కివీస్‌కు చివరి వనే్డలో విజయాన్ని సాధించిపెట్టింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన లంక 47.1 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. కివీస్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కేవలం మూడు పరుగుల వద్ద ఓపెనర్ టామ్ లాథమ్ (0) వికెట్‌ను కోల్పోయింది. నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ దినేష్ చండీమల్ క్యాచ్ అందుకోగా అతను మొదటి ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ గాయం కారణంగా వరుసగా మూడో మ్యాచ్‌కి దూరంకాగా, అతని స్థానంలో జట్టుకు సారథ్యం వహిస్తున్న కేన్ విలియమ్‌సన్‌తో కలిసి గుప్టిల్ స్కోరును ముందుకు దూకించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. విలియమ్‌సన్ 72 బంతుల్లో 61 పరుగులు చేసి, తిలకరత్నే దిల్షాన్ బౌలింగ్‌లో చండీమల్‌కు దొరికిపోయాడు. అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాజీ కెప్టెన్ రాస్ టేలర్ కూడా బాధ్యతాయుతమైన ఆటతో జట్టుకు అండగా నిలిచాడు. గుప్టిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. గుప్టిల్ 109 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 102 పరుగులు చేసి, నువాన్ కులశేఖర బౌలింగ్‌లో తిసర పెరెరా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. హెన్రీ నికోలస్ రెండు పరుగులకే అవుటయ్యాడు. కులశేఖర బౌలింగ్‌లో దిల్షాన్‌కు అతను క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టేలర్ 67 బంతుల్లో 61 పరుగులు చేసి కులశేఖర బౌలింగ్‌లో మిలింద సిరివర్దనకు చిక్కాడు. చివరిలో ల్యూక్ రోంచి (37), మిచెల్ సాంట్నర్ (21) నాటౌట్‌గా నిలవగా, కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 294 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ పిచ్‌లపై కొంత కష్టంగా కనిపించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో లంక విఫలమైంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (95), వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ చండీమల్ (50) అర్ధ శతకాలతో రాణించినప్పటికీ, మిగతా వారి నుంచి సరైన సహకారం లభించని కారణంగా లంక మరో 17 బంతులు మిగిలి ఉండగానే, 258 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్ మాట్ హెన్రీ 40 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 5 వికెట్లకు 294 (మార్టిన్ గుప్టిల్ 102, కేన్ విలియమ్‌సన్ 61, రాస్ టేలర్ 61, నువాన్ కులశేఖర 3/53).
శ్రీలంక ఇన్నింగ్స్: 47.1 ఓవర్లలో 258 ఆలౌట్ (ఏంజెలో మాథ్యూస్ 95, దినీష్ చండీమల్ 50, మాట్ హెన్రీ 5/40, ట్రెంట్ బౌల్ట్ 3/43).

ఒప్పందాన్ని అమలు చేయాలి: పిసిబి
కరాచీ, జనవరి 5: ద్వైపాక్షిక సిరీస్‌లపై తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భార త క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అ మలు చేయాల్సిందేనని, ఇది చట్టరీత్యా అనివార్యమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పి సిబి) స్పష్టం చేసింది. తమ న్యాయ నిపు ణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశా ర ని అంటూ, ఈ అంశంపై క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టులో సవాలు చేసే విష యాన్ని పరోక్షంగా ప్రస్తావించింది.