క్రీడాభూమి

బోల్ట్ అభిమాన క్రికెటర్ వకార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, ఆగస్టు 26: వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడేసి స్వర్ణాలను సాధించి, ‘ట్రిపుల్ హ్యాట్రిక్’ను నమోదు చేసిన ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, అతనికి కూడా కొంత మంది అభిమాన క్రీడాకారులు లేకపోలేదు. వారిలో పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ఒకడు. చిన్నతనంలో తాను క్రికెట్, ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టపడేవానని, పరుగు అంటే ఆసక్తి ఉండేది కాదని ఒక ఇంటర్వ్యూలో బోల్ట్ పేర్కొన్నాడు. క్రికెట్‌లో వకార్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత క్రికెటర్‌గానో, ఫుట్‌బాలర్‌గానో కొత్త జీవితాన్ని ఆరంభిస్తానని చెప్పాడు.