క్రీడాభూమి

యుఎస్ ఓపెన్ టెన్నిస్ మెయిన్ డ్రా చేరువలో సాకేత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 26: భారత టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేని యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మెయిన్ డ్రాకు చేరువయ్యాడు. మిచెల్ క్రూగర్‌ను 7-6, 6-4 తేడాతో ఓడించిన అతను ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్‌కు చేరాడు. అందులోనూ గెలిస్తే, మెయిన్ డ్రాకు అర్హత సంపాదిస్తాడు.
డేవిస్ పోటీలకు అదే జట్టు
న్యూఢిల్లీ: స్పెయిన్‌తో వచ్చేనెల 16 నుంచి 18 వరకూ జరిగే డేవిస్ కప్ పోటీలకు ఇంతకు ముందు దక్షిణ కొరియాను ఓడించిన జట్టునే భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దించనుంది. యుకీ భంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీనితో సాకేత్ మైనేనీ, రాం కుమార్ రామనాథన్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడతారు. లియాండర్ పేస్, రోహన్ బొపన్న జోడీ డబుల్స్‌లో పోటీపడుతుతుంది.