క్రీడాభూమి

లాభనష్టాల లెక్కలు! పెనుభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్ వల్ల బ్రెజిల్ ఖజానా ఖాళీ అయింది. పన్ను చెల్లింపుదారులపై పెనుభారం పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ తేరుకోవడానికి కనీసం దశాబ్దకాలం పడుతుందని అంచనా. ఇప్పటికే ఆదాయం, ఖర్చులను పరిశీలిస్తున్న బ్రెజిల్ సర్కారు ఒలింపిక్స్ వల్ల భారీగా నష్టపోయామన్న నిర్ధారణకు వచ్చేసింది. ఆర్థిక మాంద్యం తీవ్ర స్థాయికి చేరుకొని, పతనావస్థలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో, దానిని బలోపేతం చేయడానికి అటు సర్కారు, ఇటు ప్రజలు లెక్కలేనన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదేళ్లకైనా బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ ఒక గాడిలో పడితే గొప్పేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

రియో డి జెనీరో, ఆగస్టు 26: ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, పంటి బిగువున ఒలింపిక్స్‌ను పూర్తి చేసిన బ్రెజిల్ ఇప్పుడు లాభనష్టాల లెక్కల్లో మునిగితేలుతున్నది. రియో ఒలింపిక్స్‌తో సాధించింది శూన్యమేనని ఎప్పుడో స్పష్టమైంది. కేవలం రెండేళ్ల వ్యవధిలో ప్రపంచ క్రీడా రంగంలోనే రెండు అతి పెద్ద పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం బ్రెజిల్ చేసిన సాహసంగానే చెప్పుకోవాలి. 2014 సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించినప్పుడే బ్రెజిల్‌లో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే వీరాభిమానులున్న దేశంలో వరల్డ్ కప్ నిర్వాహణమై వ్యతిరేకత ఉంటే, ఒలింపిక్స్‌ను ఏ స్థాయిలో నిరసించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సాకర్ వరల్డ్ కప్ కంటే ముందు, 2013లో బ్రెజిల్‌లో నిరసన ప్రదర్శలు జోరుగా సాగాయి. ‘తెల్ల ఏనుగు’ ప్రపంచ కప్ టోర్నీని నిర్వహించడం వల్ల నష్టమేగానీ, లాభం ఉండదని లక్షలాది మంది ముక్తకంఠంతో చెప్పారు. అధికారుల చేతివాటంపై నిరసనలను వెల్లువెత్తాయి. ప్రజా వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణచివేసిన బ్రెజిల్ సర్కార్ ప్రపంచ కప్‌ను నిర్వహించి చేతులు కాల్చుకుంది. రియో ఒలింపిక్స్‌కు ముందు అలాంటి పరిస్థితే నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి, వౌలిక సదుపాయాల కొరత వంటి సవాలక్ష సమస్యలకు ఆర్థిక మాంద్యం కూడా తోడైంది. రాజకీయ సంక్షోభం యవాత్ దేశాన్ని కుదిపేస్తున్నది. అధ్యక్షురాలు డిల్మా రూసెఫ్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో, ఆమె పదవి నుంచి తాత్కాలికంగా వైదొలగింది. ఉపాధ్యక్షుడు మైఖేల్ టెమెర్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు. రాజకీయాలు భ్రష్టుపట్టిపోగా, ఒలింపిక్స్ నిర్వాహణ ఒకానొక దశలో అనుమానాస్పదంగా మారింది. అతి కష్టం మీద మెగా ఈవెంట్‌ను పూర్తి చేసిన బ్రెజిల్ ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తున్నది.
నాటి సంబరాలెక్కడ?
రియోకు ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు 2009లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ప్రకటించినప్పుడు దేశమంతా సంబరాల్లో మునిగితేలింది. కానీ, ఆ ఆనందం జాడలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఒలింపిక్స్ హక్కులను దక్కించుకోవడానికి అప్పటి అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వ విశేషంగా ఎంతో కృషి చేశాడు. ప్రపంచ దేశాలను ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డాడు. ఒలింపిక్స్ హక్కులు దక్కిన వెంటనే ఆనందంతో బిగ్గరగా ఏడ్చేశాడు. చిన్నతనంలో బూట్ పాలిష్ చేసి పొట్టపోసుకున్న లులా ఆర్వాత ఒక పరిశ్రమలో లేబర్‌గా చేరాడు. కార్మిక నాయకుడిగా ఎదిగాడు. మిలటరీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. మూడు పర్యాయాలు విఫలయత్నాల తర్వాత, బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ, అతను అవినీతి ఆరోపణలపై ఇప్పుడు కోర్టు కేసులను, విచారణను ఎదుర్కొంటున్నాడు. అతని తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన డిల్మాపైనే అలాంటి ఆరోపణలే ఉన్నాయి. ఆమెను అధ్యక్ష పదవి నుంచి గెంటి వేసేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం మీద రియో ఒలింపిక్స్‌కు పునాదులు వేసిన లులా, నిన్నమొన్నటి వరకూ వివిధ నిర్మాణాలు చేపట్టి, వేదికలను సిద్ధం చేసిన డిల్మా ఆ ఈవెంట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పట్లో సంబరాలు చేసుకున్న ప్రజలే ఇప్పుడు విమర్శిస్తున్నారు. బ్రెజిల్ రాజకీయ, ఆర్థిక ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఒలింపిక్స్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రీడలను బహిష్కరించాల్సిందిగా వివిధ వర్గాలు ఇచ్చిన పిలుపు తీవ్ర ప్రభావానే్న చూపింది. ఒలింపిక్స్ కేంద్రాల్లో సీట్లు పదో వంతు కూడా నిండలేదు. అన్నీ ఖాళీ సీట్లే దర్శనమిచ్చాయి. ఈ క్రీడలను ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో చెప్పడానికి ఖాళీ సీట్లే నిదర్శనం.