క్రీడాభూమి

గేల్‌కు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 5: ఒక మహిళా టీవీ ప్రజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడిన వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) 7,000 డాలర్ల జరిమానా విధించింది. బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో మెల్బోర్న్ రెనెగాడెస్ తరఫున ఆడుతున్న గేల్ సోమవారం నాటి మ్యాచ్‌లో కేవలం 15 బంతులు ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీవీ ప్రజెంటర్ మెల్ మెక్‌లాగ్లిన్ ఇంటర్వ్యూ చేస్తుండగా గేల్ అనుచితంగా మాట్లాడాడు. ‘నీ కళ్లలోకి చూస్తూ మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాను’, ‘బిగ్ బాష్‌ను మేమే గెలుస్తాం. ఆ వెంటనే నాతో కలిసి డ్రింక్ తీసుకోవడానికి నువ్వు వస్తావుకదూ’, ‘సిగ్గుతో నీ ముఖం ఎర్రబడింది. అంతగా సిగ్గుపడకు’ అంటూ మెక్‌లాగ్లిన్‌తో అతను మాట్లాడం లైవ్ ఇంటర్వ్యూ కావడంతో అందరికీ స్పష్టంగా వినిపించింది. ఇలావుంటే, గేల్ చేసిన వ్యాఖ్యలు, అతని తీరుపై సిఎ తీవ్రంగా స్పందించింది. ఏ స్థాయిలో ఇంటర్వ్యూల్లోనైనా ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. గేల్‌కు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. అతను ఇకపై ఎవరితోనూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడతాడన్న ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆసీస్ ఆశలపై
వర్షం నీళ్లు
సిడ్నీ, జనవరి 5: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామన్న ఆస్ట్రేలియా ఆశలకు వర్షం గండికొట్టింది. మొదటి రోజు ఆటలో కొంత భాగం వర్షం కారణంగా రద్దుకాగా, రెండో రోజు, సోమవారం 11.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 248 పరుగులు చేసింది. కాగా, మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. మొత్తం మీద మూడు రోజుల ఆటలో ఒక ఇన్నింగ్స్ కూడా పూర్తికాలేదు. మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో ఈ టెస్టు డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా, చివరి టెస్టును కూడా గెల్చుకొని క్లీన్‌స్వీప్ చేయాలని ఆశించింది. కానీ, వర్షం కారణంగా ఆసీస్ ఆశ నెరవేరడం అసాధ్యంగా మారింది.