క్రీడాభూమి

సెరెనా జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 2: కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ జోరును కొనసాగిస్తున్నది. స్వదేశంలో జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచి, ఏడోసారి ఈ టైటిల్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో వానియా కింగ్‌ను 6-3, 6-3 తేడాతో చిత్తుచేసింది. సెరెనా విజృంభణకు వానియా ఏ దశలోనూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. వరుస సెట్లలో విజయభేరి మోగించిన సెరెనా టైటిల్ రేసులో తాను ముందున్నానని నిరూపించుకుంది. సెరెనా సోదరి, ఆరో సీడ్ వీనస్ విలియమ్స్ 6-2, 6-3 ఆధిక్యంతో జూలియా జార్జెస్‌ను సులభంగా ఓడించి ముందంజ వేసింది. ఐదో సీడ్ సిమోనా హాలెప్ 6-3, 6-4 స్కోరుతో లూసీ సఫరోవాపై గెలిచింది. నాలుగో సీడ్ అగ్నిస్కా రద్వాన్‌స్కా కూడా మూడో రౌండ్ చేరింది. ఆమె రెండో రౌండ్‌లో నవోమీ బ్రాడీపై 7-6, 6-3 స్కోరుతో విజయం సాధించింది. కరోలినా ప్లిస్కోవా 6-1, 7-5 ఆధిక్యంతో క్వాలిఫయర్ మోన్‌స్టెరాట్ గంజాలెజ్‌ను ఓడించింది. జాంగ్ షుయ్ 6-3, 6-3 తేడాతో ఆస్ట్రేలియా సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్‌పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.
ఇలావుంటే, మహిళల సింగిల్స్‌లో ఈ పోటీలు ఓపెన్ టోర్నీగా మారకముందు మొలా జుర్డెట్ మలోరీ 8 యుఎస్ టోర్నీ టైటిళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఇది ఓపెన్ టోర్నీగా మారిన తర్వాత సెరెనా, క్రిస్ ఎవర్ట్ లాయిడ్ చెరి ఆరు టైటిళ్లతో రికార్డును పంచుకుంటున్నారు. వరుస విజయాలను పరిశీలిస్తే ఓపెన్ ఎరాకు ముందు మొలా జుర్డెట్ మలోరీ, హెలెన్ జాకబ్స్ చెరి నాలుగు, ఓపెన్‌గా అవతరించిన తర్వాత క్రిస్ ఎవర్ట్ లాయిడ్ నాలుగు చొప్పున వరుస విజయాలను నమోదు చేసి రికార్డులు సృష్టించారు. సెరెనా అత్యధిక యుఎస్ ఓపెన్ టైటిళ్లను సాధించిన క్రీడా కారిణిగా రికార్డు సృష్టించే క్రమంలో ముందంజ వేసింది. ఆమె ఖాతాలో ఇప్పటికే 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు ఉన్నాయ. ఎక్కువ గ్రాండ్ శ్లామ్స్‌ను సాధించిన క్రీడారిణు ల జాబితాలో నంబర్ వన్‌గా ఉన్న మార్గరెట్ కోర్ట్ రికార్డును అందుకోవడానికి ఆమె మరో రెండు టైటిళ్లను సాధించాల్సి ఉంది. ఆల్‌టైమ్ గ్రేట్‌గా రికార్డు నెలకొల్పే సత్తా ఉన్న సెరెనాను ఈసారి యుఎస్ ఓపెన్ హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు. మిగతా క్రీడాకారిణుల్లో ఆమె మాదిరి నిలకడగా రాణించే వారు తక్కువ అన్న అభి ప్రాయం వ్యక్తమవుతున్నది. ఏ రకంగా చూసినా యుఎస్ ఓపెన్‌లో టైటిల్‌ను అం దుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న సెరెనా గాయాల బారిని పడకుండా ఉంటే తన లక్ష్యాన్ని సాధిస్తుంది.