క్రీడాభూమి

చెమటోడ్చకుండానే..ప్రీ క్వార్టర్స్‌కు జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 3: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఏమాత్రం కష్టపడకుండానే ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో 34 ఏళ్ల మిఖయిల్ యూజ్నీతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 4-2 ఆధిక్యాన్ని సంపాదించాడు. అప్పటికి 32 నిమిషాల ఆట జరిగింది. ఈ దశలో యూజ్నీ కండరాల నొప్పితో బాధపడుతూ మ్యాచ్‌ని కొనసాగించలేకపోయాడు. ఫలితంగా జొకోవిచ్ ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ టోర్నీ మొదటి రౌండ్‌లో జెర్జీ జనొవిక్‌ను ఓడించిన జొకోవిచ్ రెండో రౌండ్‌లో జిరీ వెసెలీతో తలపడాల్సి ఉండింది. కానీ, అతను గాయం కారణంగా వైదొలగడంతో, వాకోవర్ లభించిన జొకోవిచ్ మూడో రౌండ్ చేరాడు. అక్కడ కూడా మ్యాచ్‌ని పూర్తిగా ఆడాల్సిన అవసరం లేకుండానే ప్రీ క్వార్టర్స్‌లో స్థానం సంపాదించాడు. మొత్తం మీద అతను పెద్దగా చెమటో డ్చకుండానే ముందంజ వేయడం విశేషం.
సిలిక్‌కు షాక్
న్యూయార్క్: ఏడో సీడ్ మారిన్ సిలిక్‌కు 26వ ర్యాంకర్ జాక్ సాక్ షాకిచ్చాడు. మూడో రౌండ్‌లో అతను సిలిక్‌పై 6-4, 6-3, 6-3 ఆధిక్యంతో వరుస సెట్లలో విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో పదో సీడ్ గేల్ మోన్ఫిల్ 6-4, 6-2, 6-4 ఆధిక్యంతో నికోలాస్ ఆల్మగ్రోపై గెలుపొందాడు.
ఎడ్మండ్‌తో పోరు
ప్రీ క్వార్టర్స్‌లో బ్రిటిష్ ఆటగాడు కేల్ ఎడ్మండ్‌తో జొకోవిచ్ తలపడతాడు. అంతకు ముందు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఎడ్మండ్ 6-4, 3-6, 6-2, 7-6 ఆధిక్యంతో అమెరికాకు చెందిన 20వ సీడ్ జాన్ ఇస్నర్‌పై సంచలన విజయం సాధించాడు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. బలమైన సర్వీసులకు మారుపేరైన ఇస్నర్ ముందు ఎడ్మండ్ ఎంత వరకు నిలుస్తాడన్నది అనుమానంగా కనిపించింది. కానీ, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 84వ స్థానంలో ఉన్న అతను అసాధారణ పోరాట పటిమను కనబరచి విజేతగా నిలిచాడు.
ఫామ్‌లోకి నాదల్
‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ చాలాకాలం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నది. యుఎస్ ఓపెన్‌లో ఎంత వరకు రాణిస్తాడో తెలియని పరిస్థితుల్లో బరిలోకి దిగిన అతను 2013 తర్వాత మొదటిసారి ఈ టోర్నీలో ప్రీ క్వార్టర్స్ చేరాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన ప్రపంచ నాలుగో ర్యాంక్ ఆటగాడు నాదల్ యుఎస్ ఓపెన్‌లో తొలిసారి 2010లో విజేతగా నిలిచాడు. 2013లో మరోసారి టైటిల్ అందుకున్నాడు. ఆతర్వాత అతను ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టలేకపోయాడు. తరచు గాయాల సమస్య వేధిస్తున్న నేపథ్యంలో అతని ఫిట్నెస్‌తోపాటు ఫామ్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యే తన కెరీర్‌ను అడ్డుకుంటున్నదని, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితిని కల్పిస్తుందని ఒకానొక దశలో నాదల్ వాపోయాడు. కానీ, చాలాకాలం తర్వాత అతను పూర్తి ఫామ్‌లో ఉన్నట్టు కనిపించాడు. మూడో రౌండ్‌లో అతను రష్యా అటగాడు ఆండ్రెయ్ గుజ్నెత్సోవ్‌ను 6-1, 6-4, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు.