క్రీడాభూమి

‘పద్మ భూషణ్’ రేసులో సుశీల్, అద్వానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డుకు ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన సుశీల్ కుమార్ (33) పేరును భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) సిఫారసు చేసింది. అలాగే సుశీల్ కుమార్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత యశ్‌వీర్ సింగ్‌తో పాటు మరో రెజ్లర్ అల్కా తొమర్ పేర్లను కూడా గత నెల ఆరంభంలోనే ఈ అవార్డుకు సిఫారసు చేసినట్లు డబ్ల్యుఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్ తొమర్ తెలిపారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే సుశీల్ కుమార్ పేరును పద్మ భూషణ్ పురస్కారానికి సిఫారసు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానిని తిరస్కరించింది. ఒలింపిక్ క్రీడల్లో వ్యక్తిగతంగా రెండు పతకాలు (2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో రజతం) సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు సుశీల్ కుమారే. ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్ రత్న అవార్డును అందుకున్న సుశీల్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాన్ని, కామనె్వల్త్ క్రీడల్లో రెండుసార్లు పసిడి పతకాలను కైవసం చేసుకోవడంతో పాటు నాలుగుసార్లు కామనె్వల్త్ చాంపియన్‌గా నిలిచాడు. ఇటీవల బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ముగిసిన ఒలింపిక్ క్రీడల పురుషుల 74 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నర్సింగ్ యాదవ్‌ను పంపడంతో ఈ క్రీడలకు సుశీల్ కుమార్ దూరమైన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డుల తర్వాత మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డుకు ఈ ఏడాది స్నూకర్ చాంపియన్ పంకజ్ అద్వానీ పేరును కూడా సిఫారసు చేశారు. ‘గోల్డెన్ బాయ్’గా పేరు పొందిన పంకజ్ అద్వానీ 2006, 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో వరుసగా పసిడి పతకాలను కైవసం చేసుకున్న విషయం విదితమే. మూడు వేర్వేరు సంవత్సరాల్లో వరల్డ్, ఆసియా, నేషనల్ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న పంకజ్ అద్వానీ ఇంగ్లీష్ బిలియర్డ్స్‌లో ‘హ్యాట్రిక్‌ల హ్యాట్రిక్’ సాధించి విశిష్టమైన రికార్డును కలిగి ఉన్నాడు.
‘పద్మశ్రీ’కి జీతూ రాయ్, శరత్ కమల్
కాగా, ఇటీవల ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్న షూటర్ జీతూ రాయ్ (29)తో పాటు భారత మాజీ నెంబర్ వన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ పేర్లను పద్మశ్రీ అవార్డులకు సిఫారసు చేశారు. దేశంలో ఎవరికీ అంతగా పరిచయం లేని షూటర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎగబాకిన జీతూ రాయ్ అంతకంటే వేగంగా కామనె్వల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకోవడంతో పాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్) ప్రపంచ పిస్తోలు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేకుని సత్తా చాటుకున్నాడు.

చిత్రాలు.. సుశీల్ కుమార్, పంకజ్ అద్వానీ