క్రీడాభూమి

నేమార్ సూపర్ గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనాస్ (బ్రెజిల్), సెప్టెంబర్ 7: సాకర్ సూపర్ స్టార్ నేమార్ కీలక గోల్ చేసి, 2018 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో కొలంబియాపై బ్రెజిల్‌కు కీలక విజయాన్ని సాధించిపెట్టాడు. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణమే దాడికి ఉపక్రమించిన బ్రెజిల్ రెండో నిమిషంలోనే గోల్‌ను నమోదు చేసింది. రెండో నిమిషంలో నేమార్ నుంచి పాస్‌ను అందుకున్న మరాండా చక్కటి గోల్ చేసి బ్రెజిల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆతర్వాత కొలంబియా దాడులకు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది. బ్రెజిల్ రక్షణ వలయాన్ని ఛేదించడానికి ఆ జట్టు ఆటగాళ్లు ఎంతగా శ్రమించినా ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో మార్క్విన్హాస్ ఓన్ గోల్‌తో కొలంబియా కోలుకుంది. బ్రెజిల్ డిఫెన్స్ విభాగంలో ఉన్న మార్క్విన్హాస్ పొరపాటున బంతిని తన గోల్‌పోస్టులోకే కొట్టి, ప్రత్యర్థి జట్టుకు ఈక్వెలైజర్‌ను అందించాడు. స్కోర్లు సమం కావడంతో కొలంబియా కూడా వ్యూహాన్ని మార్చేసింది. బ్రెజిల్ మాదిరిగానే రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం ఆరంభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే, 74వ నిమిషంలో మెరుపు వేగంతో దూసుకొచ్చిన నేమార్ ప్రత్యర్థి ఆటగాళ్లను ఏమార్చి కీలకమైన గోల్‌ను సాధించాడు. ఫిలిప్ కోరిన్టిన్హో కొట్టిన బంతి సమీపంలోకి వచ్చిన వెంటనే, దానిని ఆధీనంలోకి తీసుకున్న నేమార్ ప్రత్యర్థులు తేరుకునేలోగానే గోల్ చేశాడు.
పోర్చుగల్‌కు షాక్
పారిస్: ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో యూరోపియన్ చాంపిన్ పోర్చుగల్‌కు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. స్విట్జర్లాండ్‌తో ఢీకొన్న ఈ జట్టు 0-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ 23వ నిమిషంలో టీనేజ్ సంచలనం బ్రీల్ ఎంబొబో చేసిన గోల్‌తో స్విట్జర్లాండ్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మరో ఏడు నిమిషాల్లోనే అడ్మిర్ మెహ్మదీ ద్వారా స్విస్‌కు మరో గోల్ లభించింది. తక్కువ సమయంలోనే రెండు గోల్స్ ఆధిక్యానికి దూసుకెళ్లిన స్విస్ ఆతర్వాత ఆచి, తూచి ఆటను కొనసాగించింది. మోకాలి గాయం కారణంగా స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో బరిలోకి దిగలేకపోవడంతో ఒక్కసారిగా నీరసించిపోయిన పోర్చుగల్ తన స్థాయికి తగిన ఆటను ప్రదర్శించలేక పరాజయాన్ని కొనితెచ్చుకుంది. అరగంట ఆటలోనే రెండు గోల్స్ తేడాతో వెనుకబడిన ఈ జట్టు ఎదురుదాడికి దిగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా, స్విస్ దూకుడును అడ్డుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఫలితంగా ఒక్క గోల్ కూడా చేయలేక, 2018 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మొదటి మ్యాచ్‌ని చేజార్చుకుంది.
ఫ్రాన్స్, బెలారస్ మ్యాచ్ డ్రా
ఫ్రాన్స్, బెలారస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇరు జట్లు ఒక్క గోల్‌ను కూడా చేయలేకపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా ఇరు జట్లు మితిమీరిన డిఫెన్స్‌ను ప్రదర్శించడంతో మ్యాచ్ చివరి వరకూ నిస్సారంగా కొనసాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. కాగా, నెదర్లాండ్స్, స్వీడన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు. ఇరు జట్లు చెరొక గోల్ సాధించాయి.
లుకాకు ‘డబుల్’
సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం ఆటగాడు రొమెలు లుకాకు రెండు గోల్స్ చేసి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన అతను 61వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. ఫెరెరా కారాస్కో 81 నిమిషంలో చేసిన గోల్‌తో బెల్జియం 3-0 తేడాతో విజయం సాధించింది.
కొలంబియాపై
బ్రెజిల్‌ను
గెలిపించిన
సాకర్ స్టార్