క్రీడాభూమి

రెండంచెల టెస్టు విధానంపై ఐసిసి వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: టెస్టు క్రికెట్‌లో రెండంచెల విధానాన్ని అమలు చేయాలని చాలకాలంగా వాదిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తన ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది. వాస్తవానికి పాలక మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రావాలి. కానీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేక వ్యక్తం కావడంతో ఐసిసి వెనుకంజ వేసినట్టు సమాచారం. గవర్నింగ్ బోర్డు ఏజెండా నుంచి రెండంచెల టెస్టు క్రికెట్ ప్రతిపాదనను ఉపసంహరించినట్టు తెలుస్తోంది. కాగా, టూ టైర్ టెస్టు విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచనపై తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని, తమ ఆలోచనలతో ఏకీభవించి ఐసిసి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడం హర్షణీయమని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. రెండంచెల టెస్టులపై ఐసిసి వెనుకంజ వేసిందన్న విషయం అతని ప్రకటన స్పష్టం చేస్తున్నది. ఈ విధానం అమలైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న దేశాలు భారీగా నష్టపోతాయని ఠాకూర్ తన ప్రకటనలో వ్యాఖ్యానించాడు. క్రికెట్ అభివృద్ధికి బిసిసిఐ కంకణం కట్టుకుందని, అన్ని దేశాల్లోనూ ఈ క్రీడ ఎదగాలని కోరుకుంటున్నదని తెలిపాడు. అందుకే, టూ టైర్ విధానాన్ని వ్యతిరేకించామని అన్నాడు. తమ ఆలోచనలతో ఐసిసి ఏకీభవించడం హర్షణీయమని అన్నాడు.
ఆమోదం కష్టమే!
టెస్టు క్రికెట్ రూపురేఖలను మార్చడం వంటి కీలక అంశాలపై తీర్మానాన్ని ఆమోదించాలంటే పాలక మండలి సమావేశంలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది. ప్రస్తుతం ఐసిసిలో 10 టెస్టు హోదాగల బోర్డులు ఉన్నాయి. వీటిలో ఏడు సానుకూలంగా స్పందిస్తేగానీ టూటైర్ టెస్టు అమలు సాధ్యం కాదు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర క్రికెట్ బోర్డులు ఇప్పటికే ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. అనుకూలంగా ఉంటుందనుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) కూడా మాట మార్చింది. టెస్టు క్రికెట్ ఆడే దేశాలను రెండు వర్గాలుగా విభజించాలనిగానీ, ఆయా విభాగాలకు వేరువేరుగా టెస్టు సిరీస్‌లు నిర్వహించాలనిగానీ తాము అనుకోవడం లేదని విండీస్ క్రికెట్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం మీద టూటైర్ టెస్టు విధానానికి సర్వత్రా వ్యతిరేక వ్యక్తం కావడంతో, మూడింట రెండు వంతుల మెజారిటీ సాధ్యం కాదని ఐసిసికి అర్థమైందని, అందుకే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుందని విశే్లషకుల అభిప్రాయం. కారణాలు ఏవైనా, ప్రస్తుతానికి టెస్టు క్రికెట్ ఫార్మెట్‌లో ఎలాంటి మార్పు ఉండదనేది వాస్తవం.