క్రీడాభూమి

లుంగీ మాస్టర్ సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, సెప్టెంబర్ 7: మూడవ ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్‌ఎల్)కు జట్టును కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జట్టు యజమాని, భారత మాజీ టెస్టు క్రికెటర్ సచిన్ తెండూల్కర్ లుంగీ కట్టుకొని ప్రత్యేకంగా కనిపించాడు. సహ భాగస్వాములు, టాలీవుడ్ స్టార్లు చిరంజీవి, అక్కినేని నాగార్జున కూడా లుంగీలతో కనువిందు చేశారు. కేరళ బ్లాస్టర్స్ 27 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఒకప్పుడు మాంచెస్టర్ యూనైటెడ్ జట్టులో కీలక భూమిక పోషించిన స్టెఫెన్ కోపెల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడు. అరోన్ హ్యూజెస్‌ను మార్క్యూ ప్లేయర్‌గా ప్రకటించారు. డిఫెండర్ సెడ్రిక్ హెన్‌బోర్ట్, గోల్‌కీపర్ గ్రాహమ్ స్టాక్ వంటి మేటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. జట్టు పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత సచిన్ మాట్లాడుతూ అందరి అంచనాలకు తగిన స్థాయిలో ఆడాలని, అద్భుతంగా రాణించాలని పిలుపునిచ్చాడు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐఎస్‌ఎల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. యువకులు, సీనియర్లతో కలిసి కేరళ బ్లాస్టర్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉందని అన్నాడు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్, ముత్తూట్ పప్పచ్చన్ గ్రూప్ డైరెక్టర్ థామస్ మత్తూట్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... కొచ్చిలో బుధవారం జరిగిన ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో పాల్గొనే కేరళ బ్లాస్టర్స్ జట్టు ప్రకటన కార్యక్రమంలో లుంగీలు కట్టుకొని ప్రత్యేకంగా కనిపించిన జట్టు యజమాని, భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్, సభ భాగస్వాములు, టాలీవుడ్ నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు