క్రీడాభూమి

కోర్ట్ రికార్డు అందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 9: గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో అత్యధిక టైటిళ్లు సాధించిన మార్గరెట్ కోర్ట్ రికార్డు సెరెనాకు అందు తుందా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీ యాంశమైంది. గ్రాండ్ శ్లామ్ చాంపియన్‌షిప్స్ ఓపెన్ టోర్నీలుగా మారిన తర్వాత స్ట్ఫె గ్రాఫ్ 22 టైటిళ్లను కైవసం చేసుకుంది. అత్యధిక పర్యాయాలు విజేతగా నిలిచిన క్రీడాకారిణుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ రికార్డు కోసం విశేషంగా కృషి చేసిన సెరెనా ఈఏడాది జరిగిన తొలి గ్రాండ్ శ్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్ చేరింది. కానీ, కెర్బర్ చేతిలో 4-6, 6-3, 4-6 తేడాతో ఓటమిపాలైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నా గార్బినె ముగురుజా చేతిలో ఆమెకు 5-7, 4-6 తేడాతో ఓటమి తప్పలేదు. రెండు వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ, వింబుల్డన్‌లో ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడింది. ఫైనల్‌లో కెర్బర్‌ను 7-5, 6-3 తేడాతో ఓడించి, యుఎస్ ఓపెన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. స్ట్ఫె గ్రాఫ్ రికార్డును సమం చేసిన ఆమె గ్రాండ్ శ్లామ్ టైటిళ్ల ఆల్‌టైమ్ రికార్డుపై కనే్నసింది. 24 పర్యాయాలు విజేతగా నిలిచిన మార్గరెట్ కోర్ట్ సరసన స్థానం సంపాదించడానికి మరో రెండు టైటిళ్ల దూరంలో నిలిచింది. యుఎస్ ఓపెన్‌ను సాధించి ఉంటే, ఆమె ప్రయత్నం సులభమయ్యేది. కానీ, ఊహించని రీతిలో ప్లిస్కోవా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఈఏడాది గ్రాండ్ శ్లామ్స్ పూర్తికావడం తో కోర్ట్ రికార్డును అందుకోవడానికి సెరెనా వచ్చే సంవత్స రం వరకూ వేచి చూడక తప్పదు.