క్రీడాభూమి

పాక్ క్రికెట్ జట్టు మేనేజర్‌గా బారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, సెప్టెంబర్ 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో వెస్టిండీస్‌తో జరిగే హోం సిరీస్‌లో ఆడే పాకిస్తాన్ జట్టుకు మాజీ కెప్టెన్ వసీం బారీని మేనేజర్‌గా నియమించారు. ప్రస్తుత మేనేజర్ ఇంతికాబ్ ఆలమ్ కాంట్రాక్టు ఈనెల 30వ తేదీతో ముగుస్తుందని, అందుకే, విండీస్‌తో జరిగే సిరీస్‌కు బారీని ఆ స్థానంలో నియమిస్తున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, బారీ దీర్ఘకాల కాంట్రాక్టును కోరాడని, అయితే, విండీస్‌తో జరిగే సిరీస్‌లో తనను తాను నిరూపించుకోవాల్సిందిగా అతనికి పిసిబి హితవు పలికిందని సమాచారం.
షహర్యార్‌కు శస్త్ర చికిత్స
పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్‌కు లండన్‌లో శస్త్ర చికిత్స జరిగింది. గుండెకు వెళ్లే ఒక రక్తనాళంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ ఆసుపత్రిలో అతనికి వైద్యులు శస్త్ర చికిత్స జరిపినట్టు పిసిబి తెలిపింది. గడ్డకట్టిన రక్తాన్ని స్టంట్ ద్వారా తొలగించారని, ప్రస్తుతం ఆయన ఐసియులో ఉన్నారని వివరించింది. ఆపరేషన్ విజయవంతమైందని తెలిపింది.