క్రీడాభూమి

బార్సిలోనాకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, సెప్టెంబర్ 11: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో భాగంగా అలావెస్‌తో తలపడిన బార్సిలోనాకు చుక్కెదురైంది. లియోనెల్ మెస్సీ, లూయిస్ సౌరెజ్ వంటి మేటి ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన కోచ్ లూయిస్ ఎన్రిక్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. 1-2 తేడాతో బార్సిలోనా పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ 39వ నిమిషంలో బ్రుమ్ సిల్వ అకోస్టా ద్వారా అలావెస్‌కు తొలి గోల్ లభించింది. మరో ఏడు నిమిషాల్లోనే మథియూ మరో గోల్ సాధించి, అలావెస్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. వరుసగా రెండు గోల్స్‌ను సమర్పించుకున్న బార్సిలోనా ఆలస్యంగా ఎదురుదాడికి దిగింది. 64వ నిమిషంలో గోమెజ్ పెరెజ్ ఒక గోల్ చేశాడు. అయితే, ఈక్వెలైజర్ కోసం బార్సిలోనా చివరి క్షణం వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
రొనాల్డో గోల్: మోకాలి గాయం కారణంగా సుమారు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న రియల్ మాడ్రిడ్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మళ్లీ బరిలోకి దిగాడు. ఒసాసునాతో జరిగిన మ్యాచ్‌లో అతను గోల్ చేసి, తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. మ్యాచ్‌ని రియల్ మాడ్రిడ్ 5-2 తేడాతో గెల్చుకుంది.