క్రీడాభూమి

పుజారా డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 11: ఇండియా రెడ్‌తో ఆదివారం ప్రారంభమైన ఐదు రోజుల దులీప్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ మొదటి ఇన్నింగ్స్‌ను ఇండియా బ్లూ ఆరు వికెట్లకు 693 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. చటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీతో రాణించగా, షెల్డన్ జాక్సన్ శతకాన్ని నమోదు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా బ్లూకు మాయాంక్ అగర్వాల్, కెప్టెన్ గౌతం గంభీర్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 144 పరుగులు జోడించిన తర్వాత అగర్వాల్ (57) అవుటయ్యాడు. గంభీర్ 94 పరుగులు చేసి, ఆరు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ కేవలం 30 పరుగులకే పెవిలియన్ చేరగా, పుజారా, జాక్సన్ ఐదో వికెట్‌కు 59.4 ఓవర్లలో 243 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. జాక్సన్ 134 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జట్టు స్కోరు 693 పరుగుల వద్ద ఇండియా బ్లూ ఆరో వికెట్‌ను రవీంద్ర జడేజా (48) రూపంలో కోల్పోయింది. ఆ వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు గంభీర్ ప్రకటించాడు. అప్పటికి పుజారా 256 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 363 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 28 ఫోర్లు ఉన్నాయి.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా రెడ్ ఆట ముగిసే సమయానికి 16 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. పంకజ్ సింగ్ రెండు వరుస బంత్లు అభినవ్ ముకుంద్ (2), సుదీప్ చటర్జీ (0)లను అవుట్ చేశాడు. శిఖర్ ధావన్ (14), యువరాజ్ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు.