క్రీడాభూమి

రోహిత్‌పైనే దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

13 టెస్టులు
మన దేశంలో న్యూజిలాండ్‌తో మొదలుపెడితే, ఆస్ట్రేలియా జట్టు పర్యటించే వరకూ మొత్తం 13 టెస్టులను టీమిండియా ఆడాల్సి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సెలక్టర్ల ఎంపిక ఉంటుంది. భవిష్యత్తును కూడా పరిగణలోకి తీసుకొని, భారత్ ‘ఎ’ జట్టులోని వరుణ్ ఆరోన్ వంటి బౌలర్లకు స్థానం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, మరో ప్రత్యామ్నాయం లేని కారణంగా వికెట్‌కీపర్‌గా వృద్ధిమాన్ సాహానే కొనసాగించడం ఖాయం.

ముంబయి, సెప్టెంబర్ 11: న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయడానికి సందీప్ పాటిల్ అధ్యక్షతన గల జాతీయ సెలక్షన్ కమిటీ సోమవారం ఇక్కడ సమావేశం కానుండగా, అందరి దృష్టి ముంబయి బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మపైనే కేంద్రీకృతమైంది. అపార ప్రతిభాపాటవాలుగల రోహిత్ 2013లో వెస్టిండీస్‌పై టెస్టు కెరీర్‌ను ఆరంభించాడు. వరుసగా రెండు సెంచరీలతో అదరగొట్టాడు. కానీ, ఆతర్వాత నిలకడలేని ఆటతో అందరినీ నిరాశపరుస్తున్నాడు. ఇప్పటి వరకూ 18 టెస్టులు ఆడిన అతను మొదటి రెండు శతకాలను మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. వైఫల్యాల బాటలో నడుస్తున్న అతనిని ఇటీవల వెస్టిండీస్ పర్యటకు వెళ్లిన జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే అతనికి తుది జట్టులో స్థానం దక్కింది. వాటిలో ఒకటి వర్షం కారణంగా రద్దుకాగా, మరో మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 9, రెండో ఇన్నింగ్స్‌లో 41 చొప్పున పరుగులు చేశాడు. తాజా సిరీస్‌లోనూ విఫలమైన అతనికి సెలక్టర్లు మరో అవకాశం ఇస్తారా లేక పక్కకుపెడతారా అన్నది చూడాలి.
కోహ్లీ మద్దతు
రోహిత్ నిలకడలేమితో బాధపడుతున్నప్పటికీ, అతనికి భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు సంపూర్ణంగా ఉంది. టెస్టు ఫార్మెట్‌లో తనను తాను నిరూపించుకోవడానికి వీలుగా రోహిత్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోహ్లీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పిన 29 ఏళ్ల రోహిత్ టెస్టు ఫార్మెట్‌లో విఫలమవుతున్నాడన్నది వాస్తవం. కోహ్లీ చేసిన సూచనను పరిగణలోకి తీసుకొని రోహిత్‌కు టెస్టు జట్టులో అవకాశం ఇస్తారా లేక ఇప్పటికే తగినన్ని అవకాశాలు ఇచ్చామంటూ మరో బ్యాట్స్‌మన్‌వైపు మొగ్గు చూపుతారా అన్నది ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు జరుగుతున్న దులీప్ ట్రోఫీలోనూ రోహిత్ సమర్థంగా ఆడలేకపోతున్నాడు. ఇండియా బ్లూ తరఫున ఆడుతూ అతను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 30 పరుగులు చేసి అవుటయ్యాడు.
పోటీ తీవ్రం
రోహిత్‌కు యువ ఆటగాళ్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే స్థిరమైన అవకాశాలు దక్కకపోవడంతో మరోసారి స్థానం లభిస్తుందేమోనని చూస్తున్న ఆటగాళ్లతోపాటు, తొలిసారి జాతీయ జట్టులోకి రావాలని అనుకుంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కరుణ్ నాయర్ వంటి యువ ఆటగాళ్లు అద్వితీయ ప్రతిభతో సెలక్టర్లను ఆకట్టుకుంటున్నారు. వీరంతా ప్రతిభావంతులే కావడంతో, రోహిత్ పట్ల సెలక్టర్లు మొగ్గు చూపకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.
పుజారాకు అవకాశం!
చటేశ్వర్ పుజారాకు న్యూజిలాండ్‌తో తలపడే టీమిండియాలో స్థానం దక్కవచ్చని విశే్లషకుల అభిప్రాయం. విండీస్‌తో అతను రెండు ఇన్నింగ్స్ ఆడి మొత్తం 62 పరుగులు చేసినప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ చివరి టెస్టులో అతనిని తప్పించింది. అయితే, తాను సమర్థుడినంటూ అతను దులీప్ ట్రోఫీతో రెండు వరస శతకాలతో నిరూపించాడు. ఫైనల్‌లో అజేయ డబుల్ సెంచరీతో అలరించాడు. ఈ ఇన్నింగ్స్ అతనికి జాతీయ జట్టులో చోటు ఇప్పిస్తాయని అంచనా.
జడేజాకు పరీక్ష
దులీప్ ట్రోఫీ రవీంద్ర జడేజాకు పరీక్ష పెడుతున్నది. విండీస్ టూర్‌లో ఒక టెస్టు ఆడిన జడేజా 22 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. స్వదేశానికి వచ్చిన వెంటనే చటేశ్వర్ పుజారా తదితరులతోపాటు జడేజాను కూడా దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందిగా జాతీయ సెలక్టర్లు సూచించారు. ఇందులో ఏ స్థాయిలో రాణిస్తాడనే అంశంపైనే అతనికి జట్టులో అవకాశం దక్కుతుందని అంటున్నారు. అయితే, దులీప్ ట్రోఫీలో ఇండియా రెడ్ తరఫున ఆడుతూ ఇప్పటి వరకూ 13 వికెట్లు పడగొట్టిన ‘చైనామన్’ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా రేసులో ఉన్నారు.
రవిచంద్రన్ అశ్విన్, అతనితోపాటు విండీస్ టూర్‌లో పది కంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఎకైక బౌలర్ మహమ్మద్ షమీ, అనుభవశాలి ఇశాంత్ శర్మలకు జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. పేసర్స్‌లో భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది.