క్రీడాభూమి

ఆసియా బాస్కెట్‌బాల్ చాలెంజ్‌లో అరుదైన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, సెప్టెంబర్ 13: అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (్ఫబా) ఆధ్వర్యాన జరుగుతన్న ఆసియా చాలెంజ్ టోర్నమెంట్‌లో భారత జట్టు అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్-ఇ రెండో రౌండ్ పోరులో భారత జట్టు పటిష్టమైన చైనా జట్టును మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్ బెర్తును కైవసం చేసుకునేందుకు రేసులో నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 70-64 పాయింట్ల తేడాతో విజయం సాధించడంతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న చైనా జట్టు తొలి పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను నమోదు చేసుకున్న భారత జట్టు ప్రస్తుతం గ్రూప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాలంటే పాయింట్ల పట్టికలోని తొలి నాలుగు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో నిలవాల్సి ఉన్న భారత జట్టు బుధవారం గ్రూప్ దశలో కజకిస్థాన్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది.
ఫిబా ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు రెండేళ్ల క్రితం చైనాను ఓడించింది. అయితే ప్రస్తుతం చైనా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అమృత్‌పాల్ సింగ్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించి భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఫస్ట్ క్వార్టర్ ముగిసే సమయానికి 17-14 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్న చైనా జట్టు సెకండ్ క్వార్టర్‌లో 27-18 తేడాతో మరింత ఆధిక్యత సాధించింది. దీంతో భారత జట్టు డిఫెన్స్ విభాగాన్ని కట్టుదిట్టం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులపై అనూహ్య రీతిలో ఎదురుదాడికి దిగింది. అమృత్‌పాల్, అమ్‌జ్యోత్ అద్భుత ప్రదర్శనతో అలరించడంతో ప్రథమార్థం ముగిసే సమయానికి 31-29 తేడాతో రెండు పాయింట్ల స్వల్ప ఆధిక్యతను సాధించిన భారత జట్టు ద్వితీయార్థంలో మరింత విజృంభించి మొత్తం మీద 70-64 పాయింట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది.