క్రీడాభూమి

షకీబ్ దంపతులకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్, అతని భార్య అమ్మే అహ్మద్ శిషిర్‌కు కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. వీరిని కాక్సెస్ బజార్‌లో దించిన హెలికాప్టర్ తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. ఆ సంఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యాపార ప్రకటన షూటింగ్‌లో పాల్గొనడానికి షకీబ్, అతని భార్య శిషిర్ ఢాకా నుంచి కాక్సెస్ బజార్ పట్టణానికి సమీపంలోని రాయల్ తులిప్ రిసార్ట్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వారిని రిసార్ట్‌లో దింపిన తర్వాత తిరిగి ఢాకా వెళుతుండగా, హెలికాప్టర్ అక్కడికి 1.5 కిలోమీటర్ల దూరంలోని ఇనానీ బీచ్ వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఢాకాకు చెందిన షా ఆలం మృతి చెందాడని అధికారులు ప్రకటించారు. పైలట్ రిటైర్డ్ వింగ్ కమాండర్ షఫీకల్ ఇస్లాం కూడా గాయపడిన వారిలో ఉన్నారని తెలిపారు. కాగా, ప్రమాదం సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని షకీబ్ ట్వీట్ చేశాడు. ఆ సమయంలో తాను షూటింగ్‌లో ఉన్నానని, కాబట్టి ఎక్కువ వివరాలు తనకు తెలియవని పేర్కొన్నాడు.