క్రీడాభూమి

భారత్ ‘ఎ’ ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, సెప్టెంబర్ 17: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న ‘ఎ’ సిరీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 169 పరుగులకే ఆలౌట్‌కాగా, అందుకు సమాధానంగా ఆస్ట్రేలియా ‘ఎ’ 435 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు వెనుకంజలో పడిన భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి, ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో పడింది. అఖిల్ హెర్వాద్కర్ (82), సంజూ శాంసన్ (34) క్రీజ్‌లో ఉన్నారు. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడానికి భారత్ ఇంకా 108 పరుగులు చేయాలి. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి.