క్రీడాభూమి

స్పెయన్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవడానికి స్పెయిన్‌తో శనివారం డబుల్స్ విభాగంలో పోటీపడిన భారత్‌కు చుక్కెదురైంది. రాఫెల్ నాదల్, మార్క్ లొపెజ్ జోడీ 4-6, 7-6, 6-4, 6-4 ఆధిక్యంతో లియాండర్ పేస్, సాకేత్ మైనేజీ జోడీపై విజయభేరి మోగించింది. సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. రాంకుమార్ రామనాథన్‌ను ఫెలిసియానో లొపెజ్, సాకేత్ మైనేనిని డేవిడ్ ఫెరర్ ఓడించి స్పెయిన్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించారు. దీనితో డబుల్స్‌తోపాటు రెండు రివర్స్ సింగిల్స్‌లో గెలిస్తే తప్ప ముందంజ వేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న భారత్ డబుల్స్ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టే, పేస్, సాకేత్ శుభారంభం చేశారు. మొదటి సెట్‌లో నాదల్, మార్క్ జోడీ ఒకానొక దశలో 4-1 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, ఎదురుదాడికి దిగిన పేస్, మైనేని ఆ సెట్‌ను 6-4 తేడాతో గెలిచారు. స్పెయిన్ జోడీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు కొల్లగొట్టి అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. రెండో సెట్‌లో హోరాహోరీ పోరు కొనసాగింది. మొదటి సెట్‌లో భారత్ మాదిరిగానే, రెండో సెట్‌లో స్పెయిన్ కూడా ఆరంభంలో వెనుకబడి, ఆతర్వాత కోలుకుంది. పేస్, సాకేత్ జోడీ నుంచి ఎదురైన ప్రతిఘటనను సమర్థంగా తిప్పికొట్టిన నాదల్, మార్క్ జోడీ రెండో సెట్‌ను 7-6 తేడాతో సొంతం చేసుకుంది. మూడో సెట్‌లో జోరును కొనసాగించి 6-4 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. నాలుగో సెట్‌లో భారత జోడీ తీవ్రంగా పోరాడినప్పటికీ స్పెయన్‌దే పైచేయ అయంది. ఆ సెట్‌ను 6-4 తేడాతో సాధించిన స్పెయన్ తిరుగులేని విధంగా 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది. దీనితో చివరి రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లకు ప్రాధాన్యం లేకుండా పోయంది. డేవిస్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లను సాధించిన నికోల్ పీట్రాగెల్ రికార్డును సమం చేసే అవకాశం పేస్ చేజారింది.
ముర్రేకు పొట్రో షాక్
గ్లాస్గో: డేవిస్ కప్ సెమీ ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్‌పై అర్జెంటీనా 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. బ్రిటన్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రేకు అర్జెంటీనా ‘జెయింట్ కిల్లర్’ జువాన్ మార్టిన్ డెల్ పొట్రో షాకిచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా 6-4, 5-7, 6-7, 6-3, 6-4 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించాడు. డేవిస్ కప్‌లో ముర్రే 14 వరుస విజయ పరంపరలకు పొట్రో తెరదించాడు. మరో మ్యాచ్‌లో గైడో పెల్లా 6-7, 6-4, 6-3, 6-2 స్కోరుతో కేల్ ఎడ్మండ్‌పై గెలిచి, అర్జెంటీనా ఆధిక్యాన్ని పెంచాడు.

చిత్రం... డబుల్స్‌లో భారత్‌ను ఓడించిన
స్పెయన్ జోడీ మార్క్ లొపెజ్, రాఫెల్ నాదల్