క్రీడాభూమి

పేస్ ప్రతిభావంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌ను ‘స్పెయిన్ బుల్’, టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ పొగడ్తల్లో ముంచెత్తాడు. అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాళ్లలో పేస్ ఒకడని ప్రశంసించాడు. డబుల్స్‌లో అతనిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో భారత్‌ను 3-0 తేడాతో ఓడించిన స్పెయిన్ ప్లే వరల్డ్ గ్రూప్‌లో మరోసారి స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. డబుల్స్ విభాగంలో మార్క్ లొపెజ్‌తో కలిసి బరిలోకి దిగిన రాఫెల్ మొదటి సెట్‌ను పేస్, సాకేత్ మైనేని జోడీ చేతిలో కోల్పోయాడు. అయితే, మిగతా మూడు సెట్లలో ఎదురుదాడికి దిగి విజయం సాధించాడు. పేస్ లాంటి ఆటగాడితో ఆడడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని అన్నాడు. పేస్, సాకేత్ అద్భుతంగా పోరాటం సాగించారని, చివరికి విజయం తమను వరించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. వరల్డ్ గ్రూప్‌లోకి మళ్లీ అడుగుపెట్టినందుకు స్పెయిన్ అభిమానులంతా సంతోషిస్తారని అన్నాడు. భారత్‌కు వచ్చే ముందు తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పాడు. రెండేళ్లు వరల్డ్ గ్రూప్‌లోకి చేరలేకపోయిన తమకు ఇది చాలా కీలక పోరని, అందులో గెలవడమే లక్ష్యంగా కష్టపడ్డామని తెలిపాడు.
కడుపునొప్పే కారణం..
రాంకుమార్ రామనాథన్‌తో జరగాల్సిన మొదటి సింగిల్స్ మ్యాచ్ నుంచి తాను కడుపునొప్పి కారణంగానే తప్పుకోవాల్సి వచ్చిందని నాదల్ స్పష్టం చేశాడు. ఈ విషయంపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా అనుమానాలు వ్యక్తం చేశారని అన్నాడు. చాలాకాలంగా వేధిస్తున్న చేతి మణికట్టు గాయం మళ్లీ తిరగబెట్టిందన్న వార్త బాగా ప్రచారమైందని అన్నాడు. అదే నిజయమైతే, తాను డబుల్స్ మ్యాచ్‌లో ఆడేవాడిని కానని చెప్పాడు. తన బదులు సింగిల్స్ మ్యాచ్ ఆడిన ఫెలిసియానో లొపెజ్ గొప్పగా ఆడాడని, స్పెయిన్‌కు ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడని అన్నాడు. మొదటి సెట్‌ను కోల్పోయిన వెంటనే తాము ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా నాదల్ చెప్పాడు. ఒక్కో పాయింట్‌పైనే దృష్టి పెట్టి ఆడతామని, అందుకే సెట్‌ను గెల్చుకున్నామా లేక చేజార్చుకున్నామా అని ఆలోచించాల్సిన అవసరం కూడా తమకు రాలేదని అన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ వచ్చే ఏడాది ఐపిటిఎల్‌లో పాల్గొంటానా లేదా అన్నది తాను చెప్పలేనని అన్నాడు. నిజానికి ఈ ప్రశ్నను టోర్నమెంట్ నిర్వాహకుడు, భారత ఆటగాడు మహేష్ భూపతిని అడగాలని చెప్పాడు. తదుపరి లక్ష్యం ఏమిటని ప్రశ్నించగా, వరల్డ్ టూర్ ఫైనల్స్ చేరడమేనని అన్నాడు. ఆ దిశగా తాను శ్రమిస్తానని అన్నాడు.

చిత్రం.. రాఫెల్ నాదల్