క్రీడాభూమి

భారత్‌కు వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: డేవిస్ కప్ టెన్నిస్‌లో భారత్‌కు స్పెయిన్ చేతిలో వైట్‌వాష్ తప్పలేదు. శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లోనూ ఓడిన భారత్ శనివారం డబుల్స్‌లోనూ పరాజయాన్ని చవిచూసింది. దీనితో 3-0 ఆధిక్యాన్ని సంపాదించిన స్పెయిన్‌కు చివరి రెండు రివర్స్ సింగిల్స్ ఫలితాల ప్రభావం లేకపోయినప్పటికీ, రెంటినీ గెల్చుకొని సత్తా చాటింది. రివర్స్ సింగిల్స్ మొదటి మ్యాచ్‌లో రాంకుమార్ రామనాథన్‌పై డేవిడ్ ఫెరర్ 6-2, 6-2 తేడాతో సులభంగా గెలిచాడు. కాగా, రెండో రివర్స్ సింగిల్స్‌లో సాకేత్ మైనేనీ స్థానంలో బరిలోకి దిగిన సుమీత్ నాగల్ తీవ్రంగానే పోరును సాగించాడు. కానీ, గాయం వేధించడంతో అతను పూర్తి స్థాయి ప్రతిభను కనబరచలేకపోయాడు. ఫలితంగా మార్క్ లొపెజ్ చేతిలో 3-6, 6-1, 3-6 తేడాతో పరాజయం పాలయ్యాడు.