క్రీడాభూమి

పాక్‌పై ప్రశ్నకు ఇదా సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 20: ప్రపంచ కప్ కబడ్డీలో పాకిస్తాన్‌ను ఎందుకు ఆహ్వానించడం లేదన్న ప్రశ్నపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ తీవ్రంగా స్పందించాడు. పాక్‌పై ప్రశ్న వేయడానికి సమయం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్టోబర్ 7 నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యే మూడో ప్రపంచ కప్ కబడ్డీలో పాల్గొనే భారత జట్టు ధరించే జెర్సీని మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కపిల్ ఆవిష్కరించాడు. భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న అనూప్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం కపిల్ మాట్లాడుతూ దేశంలో క్రీడలకు ఆదరణ పెరుగుతున్నదని అన్నాడు. ప్రపంచ కప్ కబడ్డీ గురించి పాత్రికేయలు అడిన ప్రశ్నలకు కపిల్ సావధానంగా సమాధానమిచ్చాడు. అయితే, ఈ టోర్నీకి పాకిస్తాన్‌ను ఎందుకు ఆహ్వానించడం లేదని ఓ విలేఖరి ప్రశ్నించగా కపిల్ తీవ్రంగా స్పందించాడు. ఉరీ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 18 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని కపిల్ ఘాటుగా స్పందించాడు. ‘పాక్ గురించి ప్రశ్నించడంలో ఏమైనా అర్థం ఉందా? అసలు ఇలాంటి ప్రశ్న వేయడానికి ఇదా సమయం. నేను క్రీడాకారుడ్ని. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. పాక్‌తో అనుసరించాల్సిన వైఖరి వంటి అంశాలను ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ విషయాన్ని ప్రస్తావించకండి’ అంటూ మండిపడ్డాడు.

చిత్రం.. ముంబయిలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ కప్ కబడ్డీకి జెర్సీని ఆవిష్కరిస్తున్న భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అనూప్ కుమార్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్