క్రీడాభూమి

గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరి క్షణాల్లో గందరగోళపడితే, గెలిచే మ్యాచ్‌లను కూడా ఏ విధంగా కోల్పోతారన్నది ఆస్ట్రేలియాతో 2004 జనవరి 9న జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో భారత్ నిరూపించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 48.3 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రూ సైమండ్స్ 88, మైఖేల్ క్లార్క్ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కెప్టెన్ గంగూలీ అండగా నిలిచాడు. అతను 82 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉండగా, భారత్ నాలుగు వికెట్లకు 257 పరుగులు సాధించి, విజయానికి చేరువలో నిలిచింది. విజయానికి మరో 31 పరుగుల దూరంగా ఉండగా గంగూలీ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. ఆతర్వాత కేవలం 13 పరుగుల తేడాలోనే భారత్ ఆరు వికెట్లు కోల్పోయింది. సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ని 18 పరుగుల తేడాతో చేజార్చుకుంది.