క్రీడాభూమి

250వ హోం టెస్టుకు ఈడెన్ ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 24: భారత దేశంలో జరిగే 250వ చారిత్రక టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ముస్తాబవుతున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ భారత్‌కు 250వ హోం టెస్టు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరస్మరణీయంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తామని బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) ఒక ప్రకటనలో తెలిపింది. ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగే ముందు గంట కొట్టడం ఆనవాయితీగా వస్తున్నది. అదే విధంగా ఈడెన్ గార్డెన్స్ టెస్టును కూడా గంటను మోగించడంతో ప్రారంభించనున్నట్టు సిఎబి తెలిపింది. ఇరు జట్ల ఆటగాళ్లను సన్మానిస్తామని వివవరించింది. బెంగాల్ నుంచి ప్రస్తుతం భారత టెస్టు జట్టులో ఉన్న వృద్ధిమాన్ సాహా, మహమ్మద్ షమీలను ప్రత్యేకంగా సత్కరించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. కోల్‌కతాలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. 30వ తేదీ ఉత్సవాల మొదటి రోజు కావడంతో టికెట్ల అమ్మకం తక్కువగా ఉంటుందని సిఎబి అనుమానిస్తున్నది. అందుకే టికెట్ ధరలను భారీగా తగ్గించింది. అంతేగాక, ఇటీవల జరిగిన అంతర్ పాఠశాలల టోర్నీలో పాల్గొన్న 44 స్కూళ్లకు తలా 16 చొప్పున పాస్‌లను జారీ చేయనుంది.