క్రీడాభూమి

టీమిండియా స్పినే్నసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 24: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు వెలవెలబోయిన భారత స్పిన్నర్లు మూడో రోజు ఆటలో చెలరేగిపోయారు. ఒక వికెట్‌కు 152 పరుగులు చేసి, పటిష్టమైన స్థితిలో ఉన్న కివీస్‌ను దెబ్బతీశారు. భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా 56 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
మ్యాచ్ మూడోరోజు, శనివారం ఒక వికెట్‌కు 152 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ మరో ఏడు పరుగులకే టామ్ లాథమ్ వికెట్‌ను కోల్పోయింది. అతను 151 బంతుల్లో 58 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. జట్టు స్కోరుకు మరో పరుగు జత కలవగా, కీలక ఆటగాడు రాస్ టేలర్ తన ఖాతాను తెరవకుండానే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. ఆతర్వాత కివీస్ కోలుకోలేకపోయింది. ల్యూక్ రోన్చీ (38), మిచెల్ సాంట్నర్ (32), బ్రాడ్లే వాల్టింగ్ (21) కొంత సేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆధిక్యాన్ని సంపాదించే స్థాయి నుంచి ప్రత్యర్థికి ఆధిక్యాన్ని అందించే స్థితికి పడిపోయింది. కివీస్ చివరి తొమ్మిది వికెట్లు 110 పరుగుల వ్యవధిలో కూలడం గమనార్హం.
న్యూజిలాండ్‌పై 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ 50 బంతులు ఎదుర్కొని 38 పరుగులు సాధించి రాస్ టేలర్ క్యాచ్ అందుకోగా ఇష్ సోధీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం ఫస్ట్‌డౌన్ ఆటగాడు చటేశ్వర్ పుజారాతో కలిసి ఓపెనర్ మురళీ విజయ్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరూ అర్ధ శతకాలను నమోదు చేసి క్రీజ్‌లో కొనసాగుతున్నారు. విజయ్ 152 బంతుల్లో 64 పరుగులు చేయగా, పుజారా 80 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఇప్పటికే భారత్ ఆధిక్యం 215 పరుగులకు చేరుకోగా, ఇంకా తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి. విజయ్, పుజారా నాలుగో రోజు ఆటలో సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలిచి, భారీ స్కోరును నమోదు చేయడం ద్వారా కివీస్‌పై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేయడం ఖాయం. అయతే, ట్రాక్‌పై స్పిన్ ఏ వి ధంగా తిరుగుతుందో చూడాలి.

* న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, టామ్ లాథమ్ టెస్టుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని అందించడం 24 ఇన్నింగ్స్‌లో ఇది ఆరోసారి. కివీస్ తరఫున ఎక్కువ పర్యాయాలు సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రాస్ టేలర్‌తో కలిసి ఇదే రికార్డును విలియమ్‌సన్ పంచుకోవడం విశేషం.
* ఆసియాలో కేన్ విలియమ్‌సన్ 21 టెస్టు ఇన్నింగ్స్ ఆడి, నాలుగు శతకాలు, మరో నాలుగు అర్ధ శతకాలు సాధించాడు. ఈ టెస్టు కంటే ముందు, అతను పాకిస్తాన్‌తో షార్జాలో మ్యాచ్ ఆడి 192 పరుగులు చేశాడు.
* ఎడ్ కోవన్, డేవిడ్ వార్నర్ 2013 మొహాలీ టెస్టులో సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించారు. ఆతర్వాత జరిగిన ఏడు టెస్టుల్లో విదేశీ జట్లు ఏవీ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేయలేదు. విలియమ్‌సన్, లాథమ్ ఈ టెస్టులో రెండో వికెట్‌కు 124 పరుగులు జోడించారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 97 ఓవర్లలో 318 ఆలౌట్ (లోకేష్ రాహుల్ 32, మురళీ విజయ్ 65, చటేశ్వర్ పుజారా 62, రోహిత్ శర్మ 35, రవిచంద్రన్ అశ్విన్ 40, రవీంద్ర జడేజా 42 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ 3/67, నీల్ వాగ్నర్ 2/42, మిచెల్ సాంట్నర్ 3/94).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 152): మార్టిన్ గుప్టిల్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 21, టామ్ లాథమ్ ఎల్‌బి అశ్విన్ 58, కేన్ విలియమ్‌సన్ బి అశ్విన్ 75, రాస్ టేలర్ ఎల్‌బి రవీంద్ర జడేజా 0, ల్యూక్ రోన్చీ ఎల్‌బి రవీంద్ర జడేజా 38, మిచెల్ సాంట్నర్ సి వృద్ధిమాన్ సాహా బి అశ్విన్ 32, బ్రాడ్లే వాల్టింగ్ సి అండ్ బి అశ్విన్ 21, మార్క్ క్రెగ్ ఎల్‌బి రవీంద్ర జడేజా 2, ఇష్ సోధీ ఎల్‌బి రవీంద్ర జడేజా 0, ట్రెంట్ బౌల్ట్ సి రోహిత్ శర్మ బి రవీంద్ర జడేజా 0, నీల్ వాగ్నర్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (95.5 ఓవర్లలో) 262 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-35, 2-159, 3-160, 4-170, 5-219, 6-255, 7-258, 8-258, 9-258, 10-262.
బౌలింగ్: మహమ్మద్ షమీ 11-1-35-0, ఉమేష్ యాదవ్ 15-5-33-1, రవీంద్ర జడేజా 34-7-73-5, అశ్విన్ 30.5-7-93-4, మురళీ విజయ్ 4-0-10-0, రోహిత్ శర్మ 1-0-5-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ సి రాస్ టేలర్ బి ఇష్ సోధీ 38, మురళీ విజయ్ 64 నాటౌట్, చటేశ్వర్ పుజారా 50 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (47 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159.
వికెట్ల పతనం: 1-52.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 5-0-11-0, మిచెల్ సాంట్నర్ 13-5-33-0, మార్క్ క్రెగ్ 11-1-48-0, నీల్ వాగ్నర్ 8-3-17-0, ఇష్ సోధీ 7-1-29-1, మార్టిన్ గుప్టిల్ 3-0-14-0.

చిత్రం.. న్యూజిలాండ్ కీలక బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను ఎల్‌బిగా అవుట్ చేసిన రవీంద్ర జడేజాకు సహచరుల అభినందన