క్రీడాభూమి

కొన్ని సిఫార్సులు కఠినంగా ఉన్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 25: లోధా కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న కొన్ని సిఫార్సులు చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని అమలు చేయడం వల్ల ఇబ్బందులే తప్ప మేలు జరగదని భారత లెజెండరీ క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌తో మాట్లాడుతూ లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్ని ఉపయోగపడతాయని, అయితే, మరికొన్నింటిని అమలు చేయడం కష్టమని అన్నారు. లోధా కమిటీతో బిసిసిఐ అధికారులు చర్చించి, ఒక అవగాహనకు రావాలని మరో మాజీ కెప్టెన్ రవి శాస్ర్తీ చేసిన సూచనను వీరిద్దరూ సమర్థించారు. చర్చల ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని అన్నారు.
ఓటింగ్ విధానాన్ని మార్చకూడదు
ప్రస్తుతం బిసిసిఐలో అనుసరిస్తున్న ఓటింగ్ విధానాన్ని మార్చాల్సిన అవసరం లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. లోధా ప్యానెల్‌లోని సభ్యులపైనా, వారి సామర్థ్యంపైనా తనకు ఎంతో గురి ఉందని, వారిని అపారంగా గౌరవిస్తానని గవాస్కర్ చెప్పాడు. అయితే, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు వంటి కొన్ని ప్రతిపాదనలను అమలు చేయడం వల్ల నష్టపోతామని స్పష్టం చేశాడు. ఇంగ్లీష్ కౌంటీలో చాంపియన్‌షిప్స్‌లో ఇంగ్లాండ్‌లోని అన్ని జట్లూ ఆడవని గుర్తు చేశాడు. అదే విధంగా ఆస్ట్రేలియాలో ఫస్ట్‌క్లాస్ చాంపియన్‌షిప్ షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలోనూ అన్ని రాష్ట్రాలు బరిలోకి దిగవని చెప్పాడు. సామర్థ్యం లేని రాష్ట్రాలతో కూడా రంజీ వంటి దేశవాళీ టోర్నీలను ఆడించడం వల్ల వాటి స్థాయి పడిపోతుందని గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఆయా జట్లు ఏ స్థాయిలో రాణిస్తున్నాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, దశల వారీగా ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతే రంజీ ట్రోఫీకి అనుమతించాలి. ఉదాహరణకు చత్తీస్‌గఢ్‌ను తీసుకోండి. క్రింది స్థాయిలో అక్కడ క్రికెట్ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అలాంటి రాష్ట్రాల నుంచి జట్లు రంజీలోకి రావడం వల్ల నష్టం లేదు. కానీ, అన్ని రాష్ట్రాలకూ తప్పనిసరిగా అవకాశం కల్పించాలని, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలని లోధా ప్యానెల్ చేసిన ప్రతిపాదనను అంగీకరించలేను’ అన్నాడు.
బోర్డు సేవలను మరవకూడదు
దేశ క్రికెట్‌కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సుమారు ఎనిమిది దశాబ్దాలుగా చేస్తున్న సేవలను మరచిపోకూడదని కపిల్ దేవ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. బోర్డు కార్యవర్గంలో సభ్యులుగా ఉండేందుకు 60 సంవత్సరాల సీలింగ్‌ను విధించడం బాగానే ఉందని అన్నాడు. ‘సెలక్టర్‌ను కావాలంటే నాకు ఒక ఏడాదే సమయం ఉంది’ అంటూ చమత్కరించాడు. ఓటింగ్ విధానాన్ని అతను ప్రస్తావిస్తూ ఒక రాష్ట్రానికి ఒకటే ఓటు ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నాడు. ఉదాహరణకు మహారాష్టక్రు ఒకే ఓటు ఉండాలన్న సూచన ఏ రకంగానూ సమంజం కాదని తెలిపాడు. భారత క్రికెట్‌కు ముంబయి ఎంతో మంది హేమాహేమీలను అందించిందని, ఆరంభం నుంచి అక్కడే క్రికెట్ వేళ్లూనుకుందని గుర్తుచేశాడు. మహారాష్టక్రు మాత్రమే ఓటు హక్కు ఉంటే, ముంబయికి అన్యాయం జరిగినట్టు కాదా అని ప్రశ్నించాడు. క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు కూడదని కపిల్ దేవ్ అన్నాడు. ప్రతి అంశాన్నీ అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. మంజ్రేకర్ అడిన ఒక ప్రశ్నపై స్పందిస్తూ, ‘నియమించు.. ఉద్వాసన పలుకు’ అన్న సూత్రానికి తాను వ్యతిరేకినని అన్నాడు. కోచ్‌ల నుంచి సెలక్టర్లు, బోర్డు పాలక మండలి సభ్యుల వరకూ పలువురిపై వేటు పడుతున్న విషయాన్ని అతను పరోక్షంగా విమర్శించాడు. సెలక్షన్ కమిటీ కాల పరిమితిని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాలని సూచించాడు. బిసిసిఐ చాలా భారీ సంస్థ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నాడు. ఈ వ్యవస్థను అర్థం చేసుకోవడానికే మూడేళ్లలో సగం కాలం గడిచిపోతుందని, ఆతర్వాత అట్టడుగు స్థాయి నుంచి సమర్థులను ఎంపిక చేయడం అసాధ్యమవుతుందని తెలిపాడు. సెలక్షన్ కమిటీ సభ్యుల పదవీకాలాన్ని ఐదేళ్లకు పెంచాలని అన్నాడు.

చిత్రం.. కపిల్ దేవ్, గవాస్కర్