క్రీడాభూమి

గంభీర్‌కు ఆహ్వానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 27: జాతీయ జట్టులో స్థానంపై దాదాపుగా ఆశలు కోల్పోయిన గౌతం గంభీర్‌ను అదృష్టం వరించే అవకాశం కనిపిస్తున్నది. ఓపెనర్ లోకేష్ రాహుల్ కండరాల నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో, అతని స్థానంలో గంభీర్‌ను తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి భారత జట్టు మేనేజ్‌మెంట్ సూచించినట్టు సమాచారం. జట్టు మేనేజ్‌మెంట్ సూచనపై అతను ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యాడు. అతనితోపాటు యువరాజ్ సింగ్, బరీందర్ శరణ్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఫిట్నెస్ టెస్టులో పాల్గొన్నారు. వీరిలో ఎవరికీ ఫిట్నెస్ సమస్యలు లేవని పరీక్షల్లో స్పష్టమైంది. ఇలావుంటే, మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు జట్టులో శిఖర్ ధావన్ రూపంలో మరో ఓపెనర్ ఉన్నాడు. అయితే, ధావన్ ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలతో అల్లాడుతున్నాడు. అందుకే అతనిపై జట్టు మేనేజ్‌మెంట్ పెద్దగా ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది. అంతేగాక, స్టాండ్‌బైగా ఒక ఓపెనర్ ఉండాలన్న ఆలోచన కూడా కోచ్‌కు ఉన్నట్టు టీమిండియా వర్గాలు అంటున్నాయి. కెరీర్‌లో 56 టెస్టులు ఆడిన గంభీర్ 4,046 పరుగులు చేశాడు. చివరిసారి భారత్‌కు 2014 ఓవల్ టెస్టులో ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల దులీప్ ట్రోఫీని ప్రయోగాత్మకంగా గులాబీ బంతులతో, డే/నైట్ టోర్నమెంట్‌గా నిర్వహచగా, గంభీర్ ఐదు ఇన్నింగ్స్‌లో వరుసగా 94, 36, 90, 59, 77 చొప్పున పరుగులు చేశాడు. ఫామ్‌లో ఉండడమేగాక, అంతర్జాతీయ కెరీర్‌లో ఎంతో అనుభవం ఉన్నవాడు కావడం వల్లే గంభీర్ పట్ల టీమిండియా మొగ్గు చూపుతున్నదని అంటున్నారు. యువీతోపాటు బరీందర్, బుమ్రాలను ఎందుకు ఫిట్నెస్ పరీక్షకు పిలిచారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.